Yellow Teeth : మన ముఖం అందంగా కనబడడంలో మన దంతాలు చక్కటి పాత్ర పోషిస్తాయి. దంతాలు ఆరోగ్యంగా, తెల్లగా ఉంటేనే మనం అందంగా కనబడతాము. కానీ మనలో చాలా మందికి దంతాలు పసుపు రంగులో ఉంటాయి. దంతాలు పసుపు రంగులో ఉండడం వల్ల మనం చక్కగా నవ్వలేకపోతాము. నలుగురితో చక్కగా మాట్లాడలేకపోతాము. దంతాలు పసుపు రంగులో మారడానికి అనేక కారణాలు ఉంటాయి. టీ, కాఫీలను ఎక్కువగా తాగడం, పొగాకు ఉత్పత్తులను వాడడం, దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, వివిధ రకాల అనారోగ్య సమస్యలకు మందులు వాడడం వంటి వివిధ కారణాల చేత దంతాలు పసుపు రంగులోకి మారతాయి. పసుపు రంగులో ఉన్న ఈ దంతాలను తెల్లగా మార్చుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఎటువంటి శ్రమ లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. దంతాలను తెల్లగా మార్చే ఆ చిట్కా ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం అరటి పండు తొక్కను, చిటికెడు పసుపును, చిటికెడు ఉప్పును, తెల్లగా ఉంటే ఒక టీ స్పూన్ టూత్ పేస్ట్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా అరటి పండుతొక్క లోపల ఉండే తెల్లటి పదార్థాన్ని ఒక టీ స్పూన్ సహాయంతో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనిని రెండు టీ స్పూన్ల మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకున్న తరువాత ఇందులో ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత టూత్ పేస్ట్ ను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని టూత్ బ్రష్ తో తీసుకుని దంతాలను శుభ్రం చేసుకోవాలి.
సాధారణంగా మనం ఎలా అయితే దంతాలను శుభ్రం చేసుకుంటామో ఈ మిశ్రమంతో కూడా దంతాలను అదే విధంగా శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల పసుపు రంగులో ఉండే దంతాలు తెల్లగా మారతాయి. అంతేకాకుండా దంతాలు మరియు చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా ఈ చిట్కాను వాడుతూనే భోజనం చేసిన తరువాత దంతాలను చక్కగా శుభ్రం చేసుకోవాలి. టీ, కాఫీలను తక్కువగా తీసుకోవాలి. పొగాకు ఉత్పత్తులకు వీలైనంత దూరంగా ఉండాలి. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల మనం చాలా సులభంగా దంతాలను తెల్లగ\గా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.