Bellam Kakarakaya Fry : బెల్లం వేసి కాక‌ర‌కాయ ఫ్రై ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Bellam Kakarakaya Fry : కాకర‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కాక‌ర‌కాయ‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే కాక‌ర‌కాయల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. కాక‌రకాయ‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా వేపుడును త‌యారు చేస్తూ ఉంటాం. కాక‌ర‌కాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ వేపుడును ఇష్టంగా తింటారు. ఈ కాక‌ర‌కాయ వేపుడులో మ‌నం బెల్లం వేసి దీనిని మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బెల్లం వేసి చేసే కాక‌ర‌కాయ ఫ్రై మ‌రింత రుచిగా ఉంటుంది. బెల్లం వేసి కాక‌ర‌కాయ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం కాక‌ర‌కాయ వేపుడు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న కాక‌ర‌కాయ‌లు – పావు కిలో, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 3, బెల్లం తురుము – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 6, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు.

Bellam Kakarakaya Fry recipe in telugu very tasty with rice
Bellam Kakarakaya Fry

బెల్లం కాక‌ర‌కాయ వేపుడు త‌యారీ విధానం..

ముందుగా కాక‌ర‌కాయ‌ల‌ను రెండు ముక్క‌లుగా లేదా నాలుగు ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత జార్ లో కారం, వెల్లుల్లి రెబ్బ‌లు, ఉప్పు, బెల్లం వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కాకర‌కాయ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ వేయించాలి. కాక‌ర‌కాయ ముక్క‌లు పూర్తిగా వేగిన త‌రువాత వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో జీల‌క‌ర్ర‌, ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత వేయించిన కాక‌ర‌కాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి.

వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత ప‌సుపు, మిక్సీ ప‌ట్టుకున్న కారం వేసి క‌ల‌పాలి. వీటిని మ‌రో మూడు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బెల్లం కాక‌ర‌కాయ వేపుడు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కాక‌ర‌కాయ‌ల‌తో త‌ర‌చూ చేసే వేపుడు కంటే ఈ విధంగా బెల్లం వేసి చేసిన వేపుడు మ‌రింత రుచిగా ఉంటుంది. ఈ వేపుడును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts