చిట్కాలు

Curd For Beauty : పెరుగుతో ఇలా సులభంగా.. అందాన్ని రెట్టింపు చేసుకోండి..!

Curd For Beauty : పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగుని అందుకే చాలామంది, రోజు ఆహారంలో చేర్చుకుంటూ ఉంటారు. పెరుగు వలన కలిగే లాభాలు ఎన్నో. అయితే, పెరుగుతో అందాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. పెరుగుతో అందం ఎలా పెరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగులో కొంచెం బియ్యం పిండి వేసి, మీ ముఖానికి రాసుకోండి. అరగంట పాటు వదిలేసి, చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే చాలు. మీ ముఖం చాలా అందంగా మారుతుంది.

వారంలో రెండు సార్లు మీరు ఈ పద్ధతిని పాటించవచ్చు. ముఖం మీద ఉన్న మొటిమలు, నల్లని మచ్చలు అన్నీ కూడా తొలగిపోతాయి. ముఖం చాలా క్లియర్ గా మారుతుంది. అందంగా ఉంటుంది. పెరుగులో అలోవెరా జెల్ ని కలిపి ముఖానికి రాసుకుని, మీ ముఖానికి బాగా మసాజ్ చేసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే కూడా ఎంతో చక్కటి ఫలితం ఉంటుంది. వారానికి రెండు సార్లు మీరు ఈ పద్ధతిని పాటించొచ్చు.

you can use curd in this way for your beauty

మృత కణాలు తొలగిపోతాయి. ముఖం మృదువుగా మారుతుంది. ముడతలు లేకుండా, ముఖం చక్కగా వస్తుంది. పెరుగులో కొంచెం శనగపిండి కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే, కాంతివంతంగా చర్మం మారుతుంది. ఇలా, సులభంగా ఈ చిట్కాలని ట్రై చేసి, మీ ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. పైగా దీనికోసం మీరు ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు.

తక్కువ డబ్బుల్లోనే మీరు ఈ ఫేస్ ప్యాక్ ని ట్రై చేసి, ముఖాన్ని అందంగా మార్చేసుకోవచ్చు. కాంతివంతంగా ఉంటుంది. ఈ చిట్కా ని ట్రై చేస్తే, చర్మం పై సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయి. మరి, ఇక ఈ చిట్కాలు ని ట్రై చేసి, మీ ముఖాన్ని అందంగా మార్చుకోండి. ఎలాంటి సమస్య లేకుండా క్లియర్ స్కిన్ ని పొందవచ్చు.

Admin

Recent Posts