Yellow Teeth : ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని అనుకుంటారు. అందంగా ఉండాలంటే, మన నవ్వు బాగుండాలి. మన నవ్వు బాగుండాలంటే, మన పళ్ళు బాగుండాలి. చాలామంది పంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువమంది బాధపడే సమస్య పళ్ళు గార పట్టడం. పళ్ళు గార పట్టినట్లయితే, పళ్ళు చూడడానికి అసలు బాగా కనిపించవు. నవ్వితే కూడా బాగోవు. మీ పళ్ళు కూడా బాగా గారపట్టేసాయా..? అయితే ఇలా తొలగించుకోవచ్చు. ఇలా కనుక మీరు చేసారంటే, ఎంతటి గార పట్టిన పసుపు అయినా కూడా పోతుంది. ముత్యాల్లా పళ్ళు మారిపోతాయి. మరి ఇక ఎలా ఈ సమస్య నుండి బయట పడొచ్చు అనేది చూసేద్దాము.
తంబాకు, సిగరెట్ వంటి అలవాట్లకి అలవాటు పడిపోయిన వాళ్లకి ఎక్కువగా పళ్ళు పసుపు రంగు లోకి మారిపోతాయి. కొందరిలో మామూలుగానే వచ్చేస్తుంటుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి, చాలామంది డెంటిస్ట్ దగ్గరికి కూడా వెళుతూ ఉంటారు. రకరకాల టిప్స్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఇలా కనుక చేసినట్లయితే గార పట్టిన పసుపు పళ్ళు నుండి బయటపడొచ్చు. పళ్ళు ముత్యాల్లా మెరిసిపోతాయి.
ఏదైనా ఆహారం తిన్న తర్వాత నోటిని పుక్కిలించి ఉమ్మేస్తే, వెంటనే ఈ సమస్య రాకుండా ఉంటుంది. ఒకవేళ అలా చేయకపోయినట్లయితే, ఈ సమస్య బాగా వస్తుంది. మనం రోజూ అనేక ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాము. మనం తీసుకునే ఆహార పదార్థాలు, నోట్లో ఉండి పోకుండా బయటికి రావాలంటే, ఖచ్చితంగా బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకుంటే అలాంటి బాధలు ఏమీ ఉండవు.
రోజుకి రెండు సార్లు బ్రష్ చేసుకుంటే, ఇటువంటి సమస్యలు ఏమి కూడా కలగవు. కొద్దిగా పసుపు అందులో కొంచెం సాల్ట్ అలానే కొంచెం కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసి, దీనిని మీరు టూత్ బ్రష్ మీద పెట్టుకుని మామూలుగా బ్రష్ చేసుకోండి. ఇలా రాత్రిళ్ళు మీరు చేయడం వలన ఎంతటి గారపట్టినా పసుపు పళ్ళు అయినా కూడా ముత్యాల్లా మెరిసిపోతాయి. ఆ తర్వాత ఒకసారి నోటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ పేస్ట్ పెట్టి బ్రష్ చేయక్కర్లేదు.