Off Beat

విమానంలో మనం విడిచిపెట్టే వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయో తెలుసుకోండి..!

మనిషై పుట్టాక జీవితంలో ప్రతి ఒక్కరూ నిత్యం, ఆ మాటకొస్తే నిత్యం కాకపోయినా రెండు, మూడు రోజులకు ఒకసారి అయినా ఆ ప్రదేశానికి వెళ్లాల్సిందే. అదేనండీ, మరుగుదొడ్డి! అవును, మరుగుదొడ్డే కదా అని ఆశ్చర్యపోకండి. మన ప్రకృతి కార్యాన్ని నెరవేర్చుకునేందుకు, మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు అది ఉపయోగపడుతుంది. అదేనండీ, మన శరీరంలోని వ్యర్థాలను అక్కడ బయటికి విడిచి పెడతాం కదా, అందుకే అది మనకు ఆరోగ్యాన్నిస్తుందని అంటున్నాం. అంతే కదా! ఇక విషయంలోకి వద్దాం.

భూమిపై ఎక్కడ ఉన్నా అది బయటైనా, ఏదైనా నివాసం లోపలైనా మనం విడిచిపెట్టే వ్యర్థాలు మరుగుదొడ్డి ద్వారా సెప్టిక్‌ట్యాంక్‌లోకి అనంతరం స్యువరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు వెళ్తాయి. ఇదంతా సరే. మరి గాలిలో ఎగిరే విమానంలో మనం మరుగుదొడ్డికి వెళ్తే అది ఎక్కడ పడుతుంది? కింద పడుతుందనే కదా మీరు చెప్పబోయేది. అయితే కాదు. ఎందుకో తెలుసుకుందాం రండి.

where the poop will go in aeroplane toilet

సాధారణంగా ప్రతి విమానంలోనూ ప్రయాణికుల కెపాసిటీని బట్టి వేస్ట్ స్టోరేజ్ ట్యాంక్‌లను ఏర్పాటు చేస్తారు. ఇవి ఒక్కోటి దాదాపు 75 లీటర్ల వ్యర్థాలను స్టోర్ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. విమానంలో ఉండే ప్రయాణికుల సంఖ్యను బట్టి ఇవి పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యలో ఉంటాయి. ఇవన్నీ ఒక నిర్దిష్టమైన స్టోరేజ్ స్పేస్‌ను కలిగి ఉంటాయి. ఈ క్ర‌మంలో ప్ర‌యాణికులు బాత్‌రూంల‌ను ఉప‌యోగించిన కొద్దీ ఆ వ్య‌ర్థాలు స్టోరేజ్ ట్యాంక్‌ల‌లోకి వెళ్తుంటాయి.

అయితే ఆ ట్యాంక్‌ల నిల్వ సామర్థ్యం నిండి పొంగి పోయేట్టుగా అయితేనే ఇబ్బంది. అలాంటి పరిస్థితిలో మాత్రమే విమానంలో ఉపయోగించిన మరుగుదొడ్డి నుంచి వ్యర్థ పదార్థాలు కింద పడేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇలా దాదాపు అరుదుగానే జరుగుతుంది. కాబట్టి మనం నిర్భయంగా ఉండవచ్చు. ఈ క్రమంలో నిండిపోయిన ట్యాంక్‌లను విమానం ల్యాండ్ అయినప్పుడు క్లీన్ చేస్తారు. అప్పుడు ఆ ట్యాంక్‌ల నుంచి వ్యర్థాలు ఒకేసారి డంపింగ్ వ్యాన్లలోకి వెళ్తాయి. ఆ సమయంలో ముక్కు పుటాలదిరే భయంకరమైన వాసన వస్తుంది. కానీ మీరు మాత్రం దాన్ని ఫీల్ అవకండే!

ఇప్పుడు తెలిసిందా! విమానంలో మనం విడిచిన వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయో! ఇకపై ఎప్పుడు విమానం మీ పై నుంచి వెళ్లినా ఆ వ్యర్థాలు పైన పడతాయేమోనని భయపడకండేం!

Admin

Recent Posts