Home Tips

ఈ ఆహారాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఫ్రిజ్‌లో పెట్ట‌కూడ‌దు..!

నేటి సమాజంలో ఫ్రిజ్, టీవీ లేని ఇల్లు అంటూ లేదు. ఎంతపేద కుటుంబం అయినా ఇవి వాడుతూనే ఉన్నారు. ఇక మనం కూరగాయాలు బయట ఉంటే పాడైపోతాయని తప్పనిసరిగా ఫ్రిజ్‌లో పెట్టాలి అనుకుంటాం. అయితే అన్ని కూరగాయాలకు ఫ్రిజ్‌లో ఆశ్రయం ఇవ్వాల్సిన అవసరం లేదు. టమాటా ఫ్రిజ్‌లో పెడితే చల్లదనానికి పైపొర పాడవుతుంది. కావున రూం టెంపరేచర్‌లోనే వాటిని ఉంచాలి. ఎక్కువ టమాటాలు కొనేయకుండా అవసరం ఉన్న వరకే వాటిని కొనుగోలు చేయడం మంచింది. అంతేకాదు కీరదోస‌ను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఫ్రిజ్‌లోని ఉండే కూల్‌కు అవి మెత్తబడిపోతాయి. దీంతో తాజాద‌నం పోతుంది. ఆలుగడ్డల‌ను కూడా అందులో ఉంచకపోవడం మంచిది.

చల్లద‌నం కారణంగా పిండిపదార్ధాలు చక్కెరగా మారుతాయి. దీంతో ఆలుగడ్డ రుచి తగ్గుతుంది. అందుకే ఆలుగడ్డలను బయట ఉంచడమే మేలు. ఇక ఇతర తినే పదార్ధాల‌ విషయానికి వస్తే .. బ్రెడ్డు ప్యాకెట్ దీన్ని ఫ్రిజ్‌లో పెటకూడదు. చల్లదనానికి బూజు పట్టే అవకాశం ఉంటుంది. అలాగే బ్రెడ్‌ లోని పిండిపదార్థాలు చక్కెరగా మారి సహజమైన రుచి తగ్గుతుంది. అందువలన బ్రెడ్‌ వాడేయడం మంచిది. ఫ్రిజ్‌లో క్రీమ్‌ ఉండే కేక్‌‌ను కూడా పెట్టకూడదు. బయట వాతవారణంలోనే కేక్‌ రుచి తగ్గకుండా ఉంటుంది.

do not put these items in fridge at any cost

అయితే మూత ఉన్న కంటెయినర్‌లో కేక్‌ను నిల్వ ఉంచుకోవాలి. పండ్ల విషయానికి వస్తే క‌చ్చాగా ఉండే అరటిపండ్లు మగ్గాలంటే పొడి వాతావరణం అవసరం. ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల సరిగా పండకపోగా, పండుపై తోలు నల్లబడిపోతుంది. అలాగే రుచి తగ్గుతుంది. బాదం పప్పులు, వాల్‌నట్స్‌, ఎండుఖర్జూరాలు, జీడిపప్పు లాంటివి ఫ్రిజ్‌లో పెడితే రుచి పోతుంది. కావున వాటిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి మూతపెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

Admin

Recent Posts