Home Tips

పెరుగు పుల్ల‌గా మార‌కుండా త‌యార‌వ్వాలంటే.. ఇలా చేయండి..!

పెరుగన్నం అంటే ఇష్టపడని వారు ఉండరు. పెరుగన్నం తినడం వల్ల ఆహారం తొందరగా జీర్ణం కావడంతో పాటు నిద్ర కూడా బాగా పడుతుంది. మరి అలాంటి పెరుగు పుల్లగా ఉంటే అసలు తినాలనిపించాదు. మరి పెరుగు పుల్లగా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? పాలు ఎలా తోడు పెడితే పెరుగు కమ్మగా రుచిగా ఉంటుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. పాలను పెరుగుగా మార్చడానికి ముందుగా మనం చాలా నాణ్యమైన పాలను తీసుకోవాలి. వాటిని బాగా మరిగించి, చల్లారనివ్వాలి. పూర్తిస్థాయిలో చల్లరానివ్వకుండా పాలు గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి.

ఈ గోరువెచ్చటి పాలలోకి అరచెంచా పెరుగును వేయడం ద్వారా, అందులో ఉండే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా పాలు మొత్తం అభివృద్ధి చెందుతుంది. దీనినే కిణ్వన ప్రక్రియ అని కూడా అంటారు. ఈ ప్రక్రియ ద్వారా పాలు మొత్తం పెరుగుగా మారుతుంది. అలా పాలు తోడు వేసిన తర్వాత ఆ పాల గిన్నెను వెచ్చగా ఉండేటటువంటి ప్రదేశంలో పెట్టాలి. అలా పెట్టడం ద్వారా సరైన ఉష్ణోగ్రతల వద్ద బ్యాక్టీరియా అభివృద్ధి చెందటానికి వీలుగా ఉంటుంది.

how to make curd without soreness

పాలు వేడిగా ఉన్నప్పుడు తోడు వేయడం వల్ల అధిక ఉష్ణోగ్రతల వద్ద బ్యాక్టీరియా అభివృద్ధి చెందక చనిపోతుంది. అందువల్ల పాలు పెరుగుగా మారదు. ఇలా కొద్ది పాటి మొత్తంలో పెరుగును తోడు పెట్టడం వల్ల పెరుగు పుల్లగా మారకుండా మంచి రుచిని కలిగి ఉంటుంది. ఈ చిట్కాలు పాటించి పెరుగు పుల్లగా అవ్వకుండా జాగ్రత్త పడండి.

Admin

Recent Posts