Home Tips

Toothpaste : టూత్ పేస్ట్‌ను దంతాలు తోమేందుకే కాదు.. ఇన్ని ర‌కాలుగా వాడుకోవ‌చ్చు..!

Toothpaste : టూత్ పేస్ట్ కేవలం పళ్ళు తోముకోవడానికి మాత్రమే కాదు. టూత్ పేస్ వల్ల అనేక లాభాలు ఉంటాయి. టూత్ పేస్ట్ ని మనం ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా మీరు టూత్ పేస్ట్ ని క్లీనింగ్ కోసం వాడితే కచ్చితంగా చక్కటి ప్రయోజనం కనబడుతుంది. టూత్ పేస్ట్ ని ఉపయోగించి చాలా మరకల్ని వదిలించుకోవచ్చు. ఒక్కొక్క సారి కొత్తగా కొన్న వైట్ టీ షర్ట్ మీద మరకలు పడుతూ ఉంటాయి. అయితే ఇంక్‌ మరకలు, లిప్ స్టిక్‌ మరకలు ఇటువంటివి అయినప్పుడు మీరు టూత్ పేస్ట్ ని ఆ మరక మీద వేసి రుద్దితే వెంటనే మరకలు పోతాయి.

అలానే ఈ రోజుల్లో కీటకాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కీటకాల‌ వలన చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దురద కలగడం, చర్మంపై సమస్యలు వంటివి కలుగుతున్నాయి. అయితే ఇలా పురుగులు కుట్టినా, దద్దుర్లు వచ్చినా టూత్ పేస్ట్ ని అప్లై చేయండి. వెంటనే ఉపశమనం లభిస్తుంది. పైగా చర్మం ఎర్రగా మారదు.

you can use toothpaste for these uses

చేతి నుండి దుర్వాసన పోవడానికి కూడా టూత్ పేస్ట్ ని ఉపయోగించవచ్చు. మీ చేతుల్ని సబ్బుతో క్లీన్ చేసుకునే ముందు కొంచెం టూత్ పేస్ట్ ని వేసి రుద్దండి. అప్పుడు దుర్వాసన అంతా కూడా పోతుంది. ఫోన్ స్క్రీన్ మీద గీతలు కూడా పడుతూ ఉంటాయి.

అటువంటి గీతల్ని కూడా మనం టూత్ పేస్ట్ తో పోగొట్టుకోవచ్చు. ఫోన్ స్క్రీన్ పగుళ్ల మీద టూత్ పేస్ట్ ని కొంచెం అప్లై చేసి నెమ్మదిగా రుద్దుతే ఫోన్ డిస్ ప్లేపై ఉన్న గీతాలు అన్నీ కూడా పోతాయి. రంగు పెన్సిల్స్ గీతలు గోడ మీద పడితే టూత్ పేస్ట్ తో వదిలించుకోవచ్చు. ఇలా సింపుల్ గా టూత్ పేస్ట్ తో వీటిని వదిలించేయవ‌చ్చు.

Admin

Recent Posts