information

మీ ద‌గ్గ‌ర పాత క‌రెన్సీ నోట్లు, నాణేలు ఉన్నాయా ? అయితే వాటి ఎలా అమ్మాలో తెలుసుకోండి..!

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు పెద్ద‌లు. అంటే వ‌స్తువు ఎంత పాత‌ది అయితే దాని విలువ అంత పెరుగుతుంద‌ని అర్థం. ఈ క్ర‌మంలోనే ఒక‌ప్ప‌టి క‌రెన్సీ నోట్లు, కాయిన్ల‌కు మార్కెట్‌లో ప్ర‌స్తుతం భ‌లే డిమాండ్ ఉంది. అయితే అలాంటి పాత నోట్లు లేదా నాణేలు ఉన్న‌వారు వాటిని ఎలా అమ్మాలా ? అని సందేహిస్తుంటారు. కానీ ఆన్‌లైన్‌లో వాటిని తేలిగ్గా అమ్మ‌వ‌చ్చు.

పాత క‌రెన్సీ నోట్లు, నాణేల‌ను అమ్మేందుకు OLX, eBay వంటి సైట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అకౌంట్‌ను క్రియేట్ చేసి అందులో మీ ద‌గ్గ‌ర నోటు లేదా నాణేల‌కు చెందిన ఫోటోల‌ను అప్‌లోడ్ చేసి వాటికి ధ‌ర‌ను నిర్ణ‌యించి యాడ్‌ను పోస్ట్ చేస్తే చాలు. ఆస‌క్తి ఉన్న‌వారు మీ ఫోన్ నంబ‌ర్‌లో మిమ్మ‌ల్ని సంప్ర‌దించి వాటిని సుల‌భంగా కొనుగోలు చేస్తారు.

if you have currency notes of old then how to sell them

ఇక https://www.coinbazaar.in అనే సైట్‌లోనూ పాత నాణేలు, క‌రెన్సీ నోట్ల‌ను విక్ర‌యించ‌వ‌చ్చు. ఇందులో అయితే మంచి ధ‌ర వ‌స్తుంది. అయితే ఇందులో కేవ‌లం పాత నాణేలె, క‌రెన్సీ నోట్లు మాత్ర‌మే కాదు ర‌క‌ర‌కాల జ్యువెల్ల‌రీ, కాయిన్స్‌ను కొన‌వ‌చ్చు. బంగారం, వెండి నాణేల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. అందువ‌ల్ల మీ ద‌గ్గ‌ర ఏవైనా పాత నోట్లు, కాయిన్లు ఉంటే ఇక‌పై వాటిని ఎక్క‌డ అమ్మాలా ? అని సందేహించ‌కండి. ఆయా సైట్ల‌లో సంప్ర‌దించండి. సుల‌భంగా వాటిని అమ్మేయ‌వ‌చ్చు.

Admin

Recent Posts