inspiration

ఒక్క బాత్రూమ్ కోసం రూ.1.65 లక్షలు, ఒకే దెబ్బకు దేశం లోని అన్ని పెట్రోల్ బంకులకు గుణపాఠం నేర్పిన మహిళ

భారతదేశంలో పెట్రోల్ బంకులు కేవలం పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు లభించే ప్రదేశాలు మాత్రమే కాకుండా అక్కడ కొన్ని ఉచిత సౌకర్యాలు కూడా పొందవచ్చు. దూర ప్రయాణాలు చేసే వారు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు రెస్ట్‌రూమ్ సదుపాయం లాంటి వాటిని వాడుకోవచ్చు. ప్రభుత్వం దేశంలోని పెట్రోల్ బంకుల్లో బాత్రూమ్ వాడకాన్ని ఉచితంగా అందుబాటులో ఉంచాలని సూచనలు చేసింది. మీరు అక్కడ పెట్రోల్ నింపినా, నింపకపోయినా, టాయిలెట్‌ ను ఉపయోగించేందుకు ఎలాంటి షరతలు ఉండకూడదు. అయితే, వాస్తవానికి కొన్ని పెట్రోల్ బంకులు ఈ నియమాన్ని పాటించకపోవడం చూస్తూనే ఉన్నాం. ప్రత్యేకంగా, కొన్నిచోట్ల టాయిలెట్‌లను లాక్ చేసి ఉంచడం, తాళం వేసి ఉంచడం వంటి మనకు చాలా చోట్లనే కనిపిస్తుంది. ఇలాంటి ఓ సంఘటన కూడా ఇటీవల తాజాగా కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

అక్కడి ఓ పెట్రోల్ పంపు నిర్వాహకులు దాని ఆవరణలో టాయిలెట్‌ను సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచక పోవడంతో ఒక మహిళ ఈ వ్యవహారాన్ని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించిన కమిషన్ పెట్రోల్ పంపు యజమానులకు గుణపాఠం చెప్పేలా చర్యలు తీసుకుంది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన జయకుమారి అనే మహిళ మే 8, 2024 న ఆమె తన కారులో ప్రయాణిస్తూ కోజికోడ్ ప్రాంతానికి చేరుకుంది. ప్రయాణంలో ఉన్న సమయంలో ఇంధన నింపుకోవడానికి ఓ స్థానిక పెట్రోల్ బంక్ వద్ద కారు ఆపింది. అయితే ఆ టైంలో అత్యవసరంగా ఆమె బాత్రూమ్ ఉపయోగించాల్సి వచ్చింది. ఆమె పెట్రోల్ బంక్‌ లోని టాయిలెట్‌ ను ఉపయోగించాలన్న ఉద్దేశంతో సిబ్బందిని కోరింది.

woman taught a lesson to a petrol pump

కానీ అక్కడి సిబ్బంది టాయిలెట్‌ను మూసివేసి ఉంచినట్టు తెలిపారు. ఇది చూసిన జయకుమారి నిబంధనల ప్రకారం టాయిలెట్‌ ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పింది. అయినప్పటికి వారు ఆమె మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే తిరిగి ఆమెతో అసభ్యంగా మాట్లాడారు. పెట్రోల్ బంక్ సిబ్బంది ఆమె పట్ల నిర్వహించిన తీరును తెలియజేస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అప్పటివరకు తాళం వేసి ఉన్న టాయిలెట్‌ను సిబ్బంది పోలీసులు అక్కడికి చేరుకున్న విచారణ చేసిన తరువాత తాళం తీశారు. జయకుమారి అంతటితో ఆగలేదు. ఆమె ఈ అంశాన్ని వినియోగదారు ల వివాదాల పరిష్కార కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది.

పతనం తిట్ట వినియోగదారుల కమిషన్ ఈ కేసును సీరియస్‌గా పరిగణించింది. విచారణలో జయకుమారి చెప్పిన సంగతులన్నీ, పోలీసుల నివేదికలు, సాక్ష్యాల ఆధారంగా కమిషన్ తీర్పును ఇచ్చింది. పెట్రోల్ బంక్ యజమాని ఫాతిమా హన్నా.. జయకుమారికి రూ.1.65 లక్షలు పరిహారంగా చెల్లించాలని కమిషన్ ఉత్తర్వులిచ్చింది. జయకుమారి పోరాటానికి న్యాయమూర్తులు న్యాయం చేశారు. మొత్తం రూ.1.65 లక్షలు పరిహారంలో రూ.1.50 లక్షలు ఆమెకు జరిగిన మానసిక ఇబ్బంది, అవమానం కింద పరిహారంగా ఇవ్వాలని, మిగిలిన రూ.15 వేల రూపాయలు చట్టపరమైన ఖర్చుల కోసం చెల్లించాలని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రజలకు ప్రాథమికంగా అందించాల్సిన సేవలను నిరాకరించడం చాలా తప్పు. ఈ తీర్పు కేవలం ఒక సంఘటనకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పెట్రోల్ బంక్‌కు ఒక గుణపాఠంగా నిలిచేలా మారింది. రెస్ట్‌ రూమ్‌ లాంటి అవసరమైన సౌకర్యాన్ని కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచకపోతే, దాని మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని ఈ తీర్పు తెలుపుతోంది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు జయకుమారి ధైర్యాన్ని, కమిషన్ తీర్పును ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Admin

Recent Posts