బ్రహ్మోస్ క్షిపణుల విజయ గాథ ప్రపంచవ్యాప్తం అవ్వడం, అనేక దేశాలు ఆ క్షిపణులను పొందడానికి మక్కువ చూపించడంతో, ఆ మార్కెట్ ని అంది పుచ్చుకోవాలి అని రష్యా రంగంలోకి దిగింది. బ్రహ్మోస్ లో భారత్ కి 50.5% , రష్యా కి 49.5% యాజమాన్య హక్కులు ఉన్నాయి. వాటి అమ్మకం వల్ల ఇంచుమించు సగం లాభం వస్తుంది రష్యా కి. దానికి బదులు, పూర్తి రష్యా ఆయుధాలను అమ్మ గలిగితే 100% లాభాలు పొందవచ్చు కనుక, బ్రహ్మోస్ క్షిపణి అప్ప చెల్లి పిల్లల వరస ఉన్న పూర్తి రష్యన్ క్షిపణులను ముందువుంచి, ఏయే దేశాలు ఐతే బ్రహ్మోస్ ని కొనాలి అని ఉత్సాహం చూపిస్తున్నవో వారికి ప్రత్యామ్నాయం గా Bastion P క్షిపణి వ్యవస్థను ప్రతిపాదిస్తుంది.
భారత్ స్పందిస్తూ….. Bastion P కేవలం land based system అని, బ్రహ్మోస్ ఐతే నేలమీద, యుద్ద విమానాల పైన, యుద్ద నౌకల పైనా వేరు వేరు వెర్షన్ మోహరించవచ్చు అని చెబుతున్నారు.
అధికమొత్తం లో బ్రహ్మోస్ ని మేము ఉపయోస్తాము కావున, అలాగే వాటిని భవిష్యత్తులో కాలానుగుణం గా అభివృద్ధి చేయడానికి plans, funds ఇప్పటికే కేటాయించడం వల్ల కొనుగోలు దారులకు లాభం అని చెబుతున్నారు.
అన్నింటికీ మించి, రష్యా నుంచి డైరెక్ట్ గా కొనుగోలు చేస్తే అమెరికా, యూరోప్ తో ఇబ్బందులు, ఆంక్షలు ఎదురుకావచ్చు అని, వీటన్నింటినీ పరిగణించి బ్రహ్మోస్ కొనడం మేలు అని భారత తన మార్కెటింగ్ తాను చేస్తుంది. రష్యా, భారత్ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు… చాప కింద నీరులా. ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో చూడాలి.