lifestyle

రిచ్, కోట్ల ఆస్తి..! కానీ “అంబానీ” తన వెంట క్యాష్, కార్డులు తీసుకెళ్ళరంట..! ఎందుకో తెలుసా..?

ముకేష్‌ అంబానీ.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ఈయన. ఆయిల్‌, టెలికాంతోపాటు ఎన్నో రంగాల్లో ఈయనకు కంపెనీలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకడిగా ఈయన పేరుగాంచారు. ప్రస్తుతం ఈయనకు ఉన్న ఆస్తులు మొత్తం ఎంతో తెలుసా..? తెలిస్తే నోరెళ్ల బెడతారు. అక్షరాలా రూ.9 లక్షల 10 వేల 888 కోట్లు విలువ చేసే ఆస్తి ఆయనకు ఉంది. అవును మీరు విన్నది నిజమే. అయితే ఇంత ఆస్తి ఉన్న ముకేష్‌ అంబానీ ఎప్పుడూ తన వెంట డబ్బు ఉంచుకోరట. అలాగని చెప్పి క్రెడిట్‌ కార్డులను వాడుతారా..? అంటే.. ఉహు.. కాదు.. అసలు ఈయనకు క్రెడిట్‌ కార్డులే లేవట. ఏంటీ.. షాకయ్యారా..? అయినా ఇది నిజమే..!

ముఖేష్‌ అంబానీ గ‌తంలో ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో మాట్లాడుతూ పై విషయాలు తెలిపారు. తాను ఎప్పుడూ తన దగ్గర డబ్బును ఉంచుకోనని, అసలు తనకు క్రెడిట్‌ కార్టులే లేవని చెప్పారు. ఇక తాను ఎక్కడికి వెళ్లినా తన కోసం డబ్బులు ఖర్చు పెట్టే వారు ఉంటారని, అలా తన అవసరాలు తీరుతాయని ముకేష్‌ అంబానీ చెప్పారు. దీంతో ఆయన మాటలు విని అందరూ షాకయ్యారు. డబ్బు గురించి ఎవరో అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ సమాధానాలు చెప్పారు.

do you know that mukesh ambani do not keeps cards and cash with him

ఇక జియో గురించి ముఖేష్‌ అంబానీ ఏమన్నారంటే.. జియో వల్ల ఇతర టెలికాం కంపెనీలకు, మార్కెట్‌కు నష్టం వచ్చిందని అందరూ జియోను విమర్శించడం సరికాదని అన్నారు. మనకు (కంపెనీలకు) నష్టాలు వచ్చినా ఎటొచ్చీ వినియోగదారులకు లాభం అయితే కలుగుతుంది కదా, కనుక మనం ఆ మాత్రం లాస్‌ను భరిస్తే తప్పేముందీ.. ఇందులో జియోను తప్పు పట్టడానికి ఏమీ లేదు. అని వ్యాఖ్యానించారు. అవును, నిజమే మరి. సరే.. జియో నష్టాల్లో ఉందా, లేదా అన్నది పక్కన పెడితే.. అది రావడం వల్లే కదా ఇతర టెలికాం కంపెనీలు కూడా తాము ఇంత కాలం చేస్తూ వచ్చిన మోసానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాయి. లేకపోతే ఇప్పటికీ ఆయా టెలికాం కంపెనీలు వినియోగదారుల మీద చార్జిలు వడ్డించేవి. అయినా.. ఇక ఈ విషయంలో చెప్పుకోవడానికి ఏముందీ.. ఏమీ లేదు..!

Admin

Recent Posts