ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఎలాంటి జీవితాన్ని గడుపుతారో మనందరికీ తెలుసు. అంబానీల ఇంట పెళ్లి వేడుక కూడా ఓ రేంజ్ లో ఉంటుందని మనందరికీ తెలిసిందే. అయితే చాలా మంది వీళ్ళు పెద్ద పెద్ద రెస్టారెంట్లలో భోజనాలు చేస్తారని అనుకుంటున్నారు. ఇంకొందరు మనలాగే ట్రెడిషనల్ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తారని.. ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. నిజానికి అంబానీలు శాకాహారులు. డైట్ ని కచ్చితంగా పాటిస్తూ ఉంటారు. అలాగే అన్ని రకాల వంటకాలను బాగా ఇష్టపడుతుంటారు.
ఆదివారం ఇడ్లీ సాంబార్ ని ఎంజాయ్ చేసినట్లు ఒక పోస్ట్ చేశారు. ముఖేష్ అంబానీ వాళ్లకు ఒక చెఫ్ ఉన్నారు. వారి శాలరీ ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రిపోర్ట్స్ ప్రకారం ముఖేష్ అంబానీ ఇంట్లో వంట చేసే చెఫ్ నెలకు రెండు లక్షల రూపాయలు తీసుకుంటారట. అంటే ఏడాదికి 24 లక్షలు రూపాయలు సంపాదిస్తారు. పైగా హెల్త్ ఇన్సూరెన్స్, ఎడ్యుకేషనల్ సపోర్ట్ వంటి ఇతర లాభాలను కూడా పొందుతారు.
సింపుల్ వెజిటేరియన్ ఫుడ్ వీళ్ళు తీసుకుంటారు. పప్పు, అన్నం, చపాతి, కూర. అలాగే అల్పాహారం కింద ఇడ్లీ సాంబార్ తో పాటుగా బొప్పాయి జ్యూస్ తీసుకుంటారు. స్నాక్స్ కింద పాపిడి చాట్, సేవ్ పూరి వంటి వాటిని ఎంజాయ్ చేస్తారు. స్వాతి స్నాక్స్ ముంబై నుంచి ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటారట. ముకేశ్ అంబానీ ఆంటీలియాలో 600 మంది పని చేస్తారు. 27 ఫ్లోర్ల లగ్జరీ ప్రాపర్టీ నిజానికి ప్రపంచంలో ఖరీదైన ఇళ్లల్లో ఒకటి.