lifestyle

Kaliyugam : రాబోయే రోజుల్లో ఇన్ని కష్టాలా..? తప్పక తెలుసుకోవాల్సిన కలియుగ సత్యాలు..!

Kaliyugam : ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. కానీ వీటి గురించి చాలా మందికి తెలియదు. కలియుగ సత్యాలు ఇవి. కలియుగంలో ధనం వల్ల మాత్రమే మనకి గౌరవం లభిస్తుంది. కలియుగం ముందుకు వెళ్లే కొద్దీ మానవుల సమస్త సద్గుణాలు నశించిపోయి, దుర్గుణాలే ఎక్కువగా మానవుల్లో కనబడుతూ ఉంటాయి. కలియుగంలో వేలాది సంవత్సరాలుగా ఆచరిస్తున్న సనాతన ధర్మాలని వదిలి, పాషండ ధర్మం దిశగా వెళ్ళిపోయే వారి సంఖ్య పెరుగుతుంది. రోజు రోజుకీ మానవులలో ధర్మం, సత్యం, సౌచం, క్షమ, దయ, ఆయువు వంటి లక్షణాలు క్షీణిస్తాయి.

మొత్తం ప్రపంచమంతా కూడా భయంకర ప్రమాదంలో చిక్కుకొనిపోయే పరిస్థితులు కూడా రాబోయే రోజుల్లో కలగనున్నాయి. మనుషుల్లో స్వార్ధ గుణం పెరిగి, కపట వ్యవహారాలతో కాలం గడుపుతూ, ఇతరులకు హాని కలిగించే మార్గాలని వెతికే ప్రయత్నంలో అందరూ నిమగ్నమైపోతుంటారు. డబ్బుకి ప్రాధాన్యత పెరిగిపోతుంది. ధనహీనుడైన వాడు అసమర్ధుడిగా పరిగణించబడుతుంటాడు. పేదవారు అన్యాయాలకు బలైపోతారు.

kaliyugam facts to know

సంస్కారహీనులై ధనం మదంతోనే సర్వం సాధించుకోవచ్చు అన్న భావంతో, అధికారాలని పొంది, తోటి వారి పట్ల అన్యాయాలు చేయడానికి కూడా వెనకాడరు. ప్రకృతి ప్రకోపం కారణంగా చలి, ఎండ, వర్షం, మంచు వంటివి ఎక్కువ ఈ లోకంలో ఉత్పాతాలకి కారణం అవుతాయి. ధర్మం నశించిపోతుంది. పాలకులే దొంగ పనులకు పాల్పడుతుంటారు. అది చూసిన ప్రజలు కూడా అబద్దాలని ఆశ్రయించి, హింసను ప్రోత్సహిస్తూ నీచంగా బతుకుతారు.

పైగా అది గొప్ప జీవన విధానంగా భావిస్తూ ఉంటారు. కలియుగంలో సోమరులై, మంద బుద్ధి కలవారై, అల్పాయిష్కులై, భయంకరమైన రోగాలతో నిస్సహాయులు అవుతుంటారు. కలియుగ కష్టాలని అధిగమించగలిగే శక్తి కేవలం నిత్యం భగవంతుడని ఆరాధించడం వలనే కలుగుతుంది. భగవత్ ధ్యానం చేసుకోవడం, మానసిక శుద్ధితో జీవిస్తూ స్వామిని సేవించాలనే సందేశాన్ని భాగవతం చెప్పింది. ఇలానే కలియుగం కష్టాలని అధిగమించొచ్చు.

Admin

Recent Posts