కేవలం భారత దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార వేత్తల లో ముఖేష్ అంబానీ టాప్ అనే చెప్పవచ్చు. ఈయన చైర్మన్ గా మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ మంచి పొజిషన్ లో ఉంది. పెట్రో కెమికల్స్, టెక్స్టైల్స్, రిటైల్, టెలి కమ్యూనికేషన్ వంటి మొదలగు రంగాలలో ఈ సంస్థ మంచి లాభాలను పొందుతోంది.
అయితే ముకేశ్ అంబానీ తన పర్సనల్ శాలరీ కంటే తన దగ్గర పనిచేసే ఉద్యోగస్తులకే ప్రియారిటి ఇస్తారు. తాజాగా సోషల్ మీడియాలో అతని డ్రైవర్ జీతం గురించి టాక్ నడుస్తోంది. ముఖేష్ అంబానీ డ్రైవర్ నెలకు రెండు లక్షలు జీతాన్ని సంపాదిస్తాడని అంటే సంవత్సరానికి 24 లక్షలు. కార్పొరేట్ లో పనిచేసే టాప్ లెవెల్ ఉద్యోగస్తులు కంటే అతని జీతం ఎక్కువ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
అంబానీ కుటుంబానికి డ్రైవర్ గా ఉండటానికి ఎంతో శిక్షణ మరియు నైపుణ్యం అవసరం. ముఖ్యంగా లగ్జరీ వాహనాలు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఉపయోగించాల్సి వస్తుంది. అందుకే ఇటువంటి నిపుణులను ప్రైవేట్ కాంట్రాక్టింగ్ ఏజెన్సీల ద్వారా తీసుకుంటారు మరియు భద్రతను కల్పించడం వారి భాద్యత.