lifestyle

కొంద‌రు పురుషులు త‌మ భార్య‌ల‌కు భ‌య‌ప‌డుతుంటారు.. అందుకు గ‌ల కార‌ణాలు ఇవే..!

చాలావరకు పురుషులకు మహిళలు భయపడతారు. కాని కొన్ని కేసుల్లో మహిళలంటే పురుషులకు ఎంతో భయం. చూస్తే చాలు పక్కకు తప్పుకోవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. స్వతంత్రించి, మంచి వ్యక్తిత్వం, అందం, వాక్చాతుర్యం వంటివి వుంటే చాలు పురుషుడు పక్కకు తప్పుకుంటాడు. మరో కారణంగా కూడా, ఆమె తనకు చేయి జారిపోతుందేమోనన్న భయం లేదా తాను ఆమెకు లొంగి వుండాల్సి వస్తుందన్న భయం కూడా వుంటాయి. మహిళ పురుషులలో మార్పు తీసుకు వచ్చేస్తుందన్న భయం కూడా వుంటుంది.

యువకులు తమ గాల్ ఫ్రెండ్స్ చేతుల్లో కీలు బొమ్మలుగా మారిన సంఘటనలు ఎన్నో వున్నాయి. గాల్ ఫ్రెండ్ తో స్నేహం అంటే, తన సర్కిల్ ను పురుషుడు వదులుకోవాల్సిందే. మరి ఆమె మనోభావాలను నియంత్రించలేకుంటే ఇక మరీ అణిగి పడి వుండాల్సిందే. అంతేనా….మరో రకంగా…ఆమె కంట నీరు పెట్టిందంటే (ఆమెకుగల పెద్ద ఆయుధం) మరింత భయం. అందుకే మహిళలు త్వరగా కంటనీరు పెట్టేస్తారు. పురుషులు వాటికి భయపడి తప్పించుకుతిరుగుతారు.

this is why some husbands fear about their wives

మరి కొంతమంది పురుషులు, మహిళలతో వచ్చే సంబంధాలకు, బంధుత్వాలకు, బాధ్యతలకు భయపడి పారిపోతారు. పురుషులు అమాయకులు, త్వరగా మార్పు కోరుకోరు. అందుకే భయంతో తప్పించుకు తిరుగుతారు. మరో రకంగా, పురుషుడు విశ్వాసం సన్నగిల్లితే ఒక ధైర్యవంతురాలు, స్వతంత్రురాలు అయిన అందమైన మహిళ అతడిని తేలికగా భయపెట్టి లొంగదీస్తుంది. అందమైన అమ్మాయా….నాకొద్దు బాబోయ్… అనే పరిస్ధితి వచ్చేస్తుంది. ఈ కొద్దిపాటి కారణాలను పురుషులు …మహిళలంటే ఎందుకు భయపడతారు? అనే దానికి చెప్పవచ్చు.

Admin

Recent Posts