lifestyle

భార్యభర్తల బంధం ఎంత బలమైందో తెలుసుకోవాలంటే ఇలా చేయండి!

పెళ్లి జరిగేటప్పుడు తాళి కట్టిన తర్వాత, పెళ్లి కొడుకు పెళ్ళి కూతురికి ఉంగరం తొడుగుతాడు. ఎందుకు అదే వేలికి ఉంగరం తొడగాలి అనే ప్రశ్న రెయిజ్‌ అయినప్పుడు అద్భుతమైన వివరణ ఇచ్చాడు ఓ వ్యక్తి. ఆ వివరణ తర్వాత భార్యభర్తలకు మద్య ఉన్న బంధం అంత బలమైనదా అనిపించింది.నేనైతే ఆ వివరణ తర్వాత ఆయన చెప్పినట్టు ట్రై చేసి ఆశ్చర్యపోయాను. మీరూ ఇలా ట్రై చేయండి భార్యభర్తల బంధం ఎంత బలంగా ఉందో తెలుసుకోవాలంటే.

రెండు చేతులకు ఉన్న అయిదు, అయిదు వేళ్ళను చాచండి. ఇప్పుడు మద్య వేలును సగానికి వంచి .. మొత్తం అన్ని వేళ్ల‌ను ఎదురెదురుగా ఒకదానితో ఒకటి టచ్ చేయండి. ఇప్పుడు బొటన వేళ్ల ను విడదీయండి..ఈజీగా విడిపోతోంది ఎందుకంటే వాళ్లు మీ తల్లీదండ్రులు చివరి వరకు మీతో ఉండరు. ఇప్పుడు చూపుడు వేలు విడదీయండి . ఇది కూడా ఈజీగా విడిపోతోంది. వీళ్లు మీ సోదరుల లాంటివారు, వారు కూడా మీతో చివరిదాకా ఉండరు.

touch your fingers like this to know wife and husband relationship touch your fingers like this to know wife and husband relationship

ఇప్పుడు చిటికెన వేళ్లను విడదీయండి..ఇది కూడా ఈజీగా విడిపోతోంది, వీళ్లు మీ పిల్లలాంటి వారు, వారు కూడా మీతో చివరి దాకా ఉండరు. ఇప్పుడు ఉంగరపు వేలును విడదీసే ప్రయత్నం చేయండి. మధ్య‌ వేలును ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా…. ట్రై చేశారా? అది అసాధ్యం..అదే భార్యాభర్తల మద్య బంధం.

Admin

Recent Posts