ఇప్పటికి మన ఇండ్లల్లో మంగళవారం, గురువారం రోజుల్లో తలస్నానం చేయొద్దని మన పెద్దలు చెబుతుంటారు. ఇది అనాది నుండి ఓ నమ్మకంగా వస్తుంది. అయితే దీని వెనుక ఓ చిన్నపాటి లాజిక్ ఉందట. గతంలో ఆడవాళ్లు స్నానాలు చేయాలంటే….. సరస్సులు, నదుల దగ్గర చేసే వారట.. కాలక్రమేణా ఆరుబయట స్నానమాచరించడం అంత శ్రేయస్కరం కాదని…తర్వాతర్వాత తడకలను ఏర్పాటు చేసుకొని స్నానాలు చేయడం మొదలు పెట్టారంట.
ఇప్పటిలాగా అప్పుడు….నీళ్లను ఇంట్లో నింపుకునే సౌకర్యం కానీ…. ఇంట్లోనే కుళాయిలను ఏర్పాటు చేసుకునే అవకాశం కానీ లేదు, నీళ్లు కావాలంటే…కొలను, సరస్సుల నుండి కుండలతో తెచ్చుకోవాల్సి వచ్చేది. దీనికి తోడు ఆడవారి స్నానం అంటే…మినిమమ్ రెండు బిందెల నీళ్లు అవసరం..దానికి తోడు తల స్నానం అంటే…..ఇంకా రెండు బిందెల నీరు అధనంగా అవసరం ఉంటాయి.
సో ….అంతకష్టపడి ..అంత దూరం నుండి నీటిని తెచ్చుకోవడం ఎందుకు? అనీ, దానికి తోడు నీటి ఆదా కొరకని…మంగళ, గురువారాల్లో తలస్నానం చేయకూడదనే నియమం ప్రచారంలోకి వచ్చిందట. అంతేకాదు మహిళలు ప్రతి రోజూ తలస్నానం చేస్తే వారి కురులు పచ్చిగా ఉండండం వల్ల..విపరీతమైన తలనొప్పి, నుదుటి నొప్పి వచ్చే అవకాశాలు ఉండడం కూడా ఈ నియమం వ్యాప్తిలోకి రావడం ఓ కారణమట.