lifestyle

సోమ‌వారం చాలా బందికి బ‌ద్ద‌కంగా ఉంటుంది.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">వారంలో సోమవారం ప్రతివారూ ఎంతో బద్ధకంగా వృత్తి వ్యాపారాలలో దిగుతారు&period; పనికి వెళ్ళాలంటే చికాకు&period; వీలైతే&comma; ఆ రోజు కూడా సెలవు పెట్టేసి ఆనందించేయటానికి చూస్తారు&period; మరి వారంలో వచ్చే మొదటిరోజైన ఈ మండే&&num;8230&semi; బద్ధకాలు మానసికమైనవేనా లేక ఈ రకమైన అలసటకు వేరే కారణాలున్నాయా&quest; సరైన కారణాలు తెలిస్తే ఈ సోమరి తనానికి స్వస్తి చెప్పచ్చు&period; కనుక కొన్ని కారణాలు విశ్లేషిస్తున్నాం&comma; పరిశీలించండి&period; ఇక్కడ ప్రధాన అంశం మన జీవన విధానంలో మార్పులు&period; వారంలో పూర్తి బిజీ అయిపోవడం&comma; వారాంతం వచ్చిందంటే బద్ధకించేయటం&period; ఒక సగటు మనిషి ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తే&comma; రోజంతా బిజీగా వుండి రాత్రి 10 గంటలకు పడక ఎక్కుతాడు&period; మరుసటిరోజు ఉదయం 10 గంటలకు నిద్ర లేస్తాడు మరల రాత్రి 12 గంటలకు పడుకుంటాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రకమైన అపసవ్యత బాడీ క్లాక్ ను డిస్టర్బ్ చేస్తుంది&period; మీ శరీరం ఎల్లపుడూ ఏం చేయాలి అనే సంకేతాల బయాలాజికల్ క్లాక్ కు అలవాటు పడిపోయింది&period; కనుక మీరు మీ శరీరానికి&&num;8230&semi; 2 రోజులు వినకపోతే అది సోమవారం వచ్చే సరికి మీరు చెప్పేది తిరస్కరిస్తుంది&period; అందుకే సోమవారంనాడు అంత బద్ధకంగా వుంటుంది&period; సోమవారంనాడు మీరెప్పుడైనా విపరీతమైన తలనొప్పితో నిద్ర లేచారా&quest; దానికి కారణం మీరు అధికంగా నిద్రించటమే&period; వారంలో ఉరుకులు పరుగులు పెట్టేటపుడు మీ రెప్పుడూ బద్ధకంగా వుండరు&period; నిద్ర అధికమైతేనే మీరు నిద్ర వచ్చేస్తున్నట్లు భావిస్తారు&period; సోమవారం కూడా ఆదివారం నిద్ర అధికమైతేనే బద్దకం ఏర్పడేది&period; కనుక చిన్నపాటి మార్పు చేసుకొని మీరు వారాంతపు సెలవులలో కూడా కొద్దిగా బిజీగా వుండండి&period; ఒక గంట మాత్రమే లేటుగా లేవండి&period; వారంలో మీరు చేయని వ్యాయామాలు చేయండి&period; దాని తర్వాత మీరు కోరిన సెలవు విశ్రాంతి మీకు ఆ రోజంతా దొరుకుతుంది&period; మధ్యాహ్నం చిన్న కునుకు మాత్రమే తీయండి&period; రాత్రికి 8 గంటల నిద్రపొండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87813 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;lazy-in-office&period;jpg" alt&equals;"why most people are lazy in office on monday " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక్కొకపుడు వారంతపు సెలవులలో ప్రయాణాలు చేస్తాము&period; అవి అలసట కలిగిస్తాయి&period; శుక్రవారం రాత్రి బయలు దేరటం తిరిగి ఆదివారం ఇల్లు చేరటం చేసి మన ఎనర్జీలన్ని ఖర్చుపెట్టేస్తాము&period; వారాంతంలో మీలో పోయిన ఎనర్జీలు భర్తీ చేసుకోడానికి విశ్రాంతి తప్పక తీసుకోవాలి&period; ఈ విశ్రాంతి మరల మీకు వారమంతా శ్రమపడేలా చేస్తుంది&period; ఒక్కొక్కపుడు సోమవారం ఏవైనా మీటింగులవంటివి వుంటే వాటి ఒత్తిడి కూడా మీకు సోమవారం బద్ధకాన్ని కలిగిస్తుంది&period; దీనికి కారణం మానసికంగా అలసిపోవటం&period; వారమంతా పనిచేశారు&period; మరోవారం పనిచేయాలంటే కొంత అలసటగా వున్నట్లనిపిస్తుంది&period; సమస్యకు పరిష్కారంగా&comma; శుక్రవారం పని మానేయండి&comma; లేదా టెన్షన్ పడేటంత పని చేయకండి&period; శనివారం&comma; ఆదివారం మధ్యాహ్నం పనిచేయండి&period; శనివారం రాత్రి ఆదివారం ఉదయం లిమిటెడ్ గా ఆనందించండి&period; ఇలా చేస్తే సోమవారంనాడు బద్ధకమనేది మీ దరి చేరదు&period; ఈ మంచి ఆరోగ్య సూచనలు పాటించి సోమవారం ఉదయపు సోమరితనాన్ని వదిలించుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts