వైద్య విజ్ఞానం

గర్భస్థ శిశువుకు మన మాటలు అర్ధమౌతాయా?

<p style&equals;"text-align&colon; justify&semi;">తల్లి గర్భంలో ఉన్న శిశువుకు మాటలు వినిపిస్తాయని&comma; అర్ధమౌతాయని పురాణ కథనాలు అనేకం ఉన్నాయి&period; ఇవి అతిశయోక్తులు కాదు&comma; ఇందులో నిజం ఉందని ఉదాహరణ సహితంగా తెలియజేశాయి ధార్మిక గ్రంధాలు&period; అభిమన్యుడు పెరిగి పెద్దయ్యాక పద్మవ్యూహం గురించి నేర్చుకోలేదని&comma; తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని భారతంలో వర్ణించారు&period; అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో&comma; చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు&period; అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్ధం చేసుకున్నాడు&period; అయితే&comma; పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కనుకనే తర్వాతి కాలంలో అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్ళి వీరోచితంగా పోరాడాడు కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు&period; హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు కూడా తల్లి గర్భంలో ఉండగా నారదుడి మాటలు విని ఆకళింపు చేసుకున్నాడని&comma; అందువల్లనే పుడుతూనే విష్ణుభక్తుడు అయ్యాడని చెప్తారు&period; నారదుడు లీలావతికి చేసిన ఉపదేశం ఆమె కంటే కూడా ఆమె గర్భంలో పెరుగుతున్న ప్రహ్లాడునికే ఎక్కువ ఉపయోగపడ్డాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70128 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;fetus&period;jpg" alt&equals;"can fetus understands outside sounds " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేర్చుకోవడం అనేది గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ప్రారంభమౌతుందని ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా అనేక పరిశోధనలు చేసి నిరూపిస్తున్నారు&period; కడుపులో ఉన్న పిండానికి ముందుగానే వినికిడి శక్తి ఏర్పడుతుందని&comma; దాంతో తల్లితో ఇతరులు మాట్లాడే మాటలు&comma; తల్లి ఇతరులతో చెప్పే సంగతులు విని గ్రహించగాలుగుతారని నిపుణులు&comma; మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు&period; గర్భస్థ శిశువు మన మాటలు వింటుంది&comma; గ్రహిస్తుంది కనుక గర్భిణీ స్త్రీలను వీలైనంత ప్రశాంతంగా ఉండమని&comma; ఆవేశాలు&comma; అరుపులకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు&period; ఎంత మంచి మాటలు వింటూ&comma; ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగితే శిశువు అంత ఆరోగ్యంగా పుట్టి పెరుగుతుంది అని సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts