వైద్య విజ్ఞానం

తరచూ కడుపు నొప్పితో బాధపడుతున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి!

సాధారణంగా మన శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందించే వాటిలో మన పేగులు ఒకటి. ఇవి శక్తిని గ్రహించడంతో పాటు, మానసిక సమతుల్యతను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన పేగులలో మన ఆరోగ్యాన్ని కాపాడే మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి. దీని ద్వారా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి.అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది వారి జీవనశైలిలో ఎన్నో మార్పులను చోటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే సరేనా పోషకాహారానికి బదులుగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడటంతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందింప చేసే బ్యాక్టీరియాలు నశించిపోయి తరచూ తీవ్రమైన కడుపు నొప్పి సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఈ విధంగా కడుపు నొప్పి రావడానికి మనం చేసే కొన్ని తప్పులు కూడా కారణమవుతాయి మరి ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

*సాధారణంగా ప్రతి రోజూ వారి ఆహారంలో భాగంగా ఎక్కువ మోతాదులో చక్కెర తీసుకుంటారు. అధిక మోతాదులో చక్కెర తీసుకోవటంవల్ల మన ప్రేగులలో ఉండే బ్యాక్టీరియా పూర్తిగా దెబ్బతింటుంది తద్వారా తరచూ మనకు కడుపునొప్పి రావడం మొదలవుతుంది.

do not make these mistakes if you are suffering from stomach ache

*మన శరీరానికి కావల్సినంత నిద్ర లేకపోవడం వల్ల అధిక ఒత్తిడి ఆందోళనకు గురి కావడం వల్ల గట్ బ్యాక్టీరియా పూర్తిగా దెబ్బతింటుంది.

*మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావాలంటే తప్పనిసరిగా నీటిని తీసుకోవాలి. అయితే చాలామంది నీటి పరిమాణం పూర్తిగా తగ్గించడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

*మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ లోపించడం వల్ల కూడా ఈ విధమైనటువంటి సమస్య తలెత్తుతుంది. ఫైబర్ కలిగిన ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా తీసుకున్న ఆహారం సరైన క్రమంలో జీర్ణమవుతుంది.

*అధికంగా మద్యపానం చేయడం వల్ల దాని ప్రభావం గట్ బ్యాక్టీరియాలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ కారణం చేత మన శరీరానికి మంచి చేసే బ్యాక్టీరియాకు తీవ్రమైన హాని కలుగుతుంది.

Admin

Recent Posts