వైద్య విజ్ఞానం

Good Bacteria : మన శ‌రీరంలో ఉండే మంచి బాక్టీరియా గురించి తెలుసా.. అది ఎలా పెరుగుతుంది అంటే..?

Good Bacteria : మ‌న‌కు క‌లిగే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మూల కార‌ణం.. బాక్టీరియా, వైర‌స్‌లు, ఇత‌ర సూక్ష్మ క్రిముల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే బాక్టీరియా అన‌గానే వాటితో మ‌న‌కు వ్యాధులు వ‌స్తాయ‌నే చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి మ‌న‌కు మంచి చేసే బాక్టీరియా కూడా ఉంటుంది. అది మ‌న శ‌రీరంలో జీర్ణాశ‌యం, పేగుల్లో ఉంటుంది. ఆ బాక్టీరియా వ‌ల్లే మ‌నం తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అలాగే క్యాన్స‌ర్‌, గుండె జ‌బ్బులు రాకుండా చూడ‌డంలో, కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో, శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలోనూ మంచి బాక్టీరియా మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. ఈ క్ర‌మంలోనే మ‌న శ‌రీరంలో మంచి బాక్టీరియాను ఎలా పెంచుకోవాలో.. అందుకు ఏమేం తినాలో, ఏమేం చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందామా..!

ప్రొ బ‌యోటిక్స్ అధికంగా ఉండే పాలు, పాల సంబంధ ఉత్ప‌త్తులు, ప‌ప్పులు, సోయా ఉత్ప‌త్తులు త‌దిత‌ర ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటే మ‌న శ‌రీరంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీని వల్ల మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం సుల‌భంగా గ్ర‌హిస్తుంది. అలాగే చెడు బాక్టీరియా న‌శిస్తుంది. ఫైబ‌ర్ (పీచు ప‌దార్థం) ఎక్కువ‌గా ఉండే తాజా ఆకు కూర‌లు, కూర‌గాయ‌లు, పండ్లు త‌దిత‌ర ఆహారాల‌ను నిత్యం తీసుకున్నా మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. మ‌న శ‌రీరంలో మంచి బాక్టీరియాను పెంచుకోవాలంటే చ‌క్కెర‌ను బాగా త‌క్కువ‌గా తీసుకోవాలి. వీలుంటే పూర్తిగా మానేయాలి. చ‌క్క‌ర వ‌ల్ల మ‌న శ‌రీరంలో మంచి బాక్టీరియా న‌శించి చెడు బాక్టీరియా పెరుగుతుంది. ఫ‌లితంగా బాక్టీరియా, వైర‌స్‌, ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు ఎక్కువ‌గా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

do you know about good bacteria in our gut

ప్ర‌కృతి వైద్యంలో చాలా వ‌ర‌కు బుర‌ద‌తో చికిత్స ఉంటుంది. ఎందుకంటే బుర‌దలో మ‌న శ‌రీరానికి మేలు చేసే బాక్టీరియా ఉంటుంది. అందుక‌ని వీలు కుదిరిన‌ప్పుడ‌ల్లా బుర‌ద‌ను ఒంటికి రాసుకుని త‌డి ఆరిపోయాక స్నానం చేస్తే చాలు. లేదంటే మ‌ట్టిలో కాసేపు ఆట‌లాడినా మ‌న శ‌రీరంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. నిత్యం మ‌నం ఆరోగ్యంగా ఉండాల‌న్నా.. ఉత్సాహంగా, శ‌క్తితో ప‌నిచేయాల‌న్నా.. రోజూ త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్ర‌పోవాలి. అయితే మ‌న శరీరంలో మంచి బాక్టీరియా పెర‌గాల‌న్నా నిత్యం క‌నీసం 7 నుంచి 9 గంట‌ల పాటు క‌చ్చితంగా నిద్రించాలి. అప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. నిత్యం పొట్ట‌కు సంబంధించిన వ్యాయామాల‌ను చేయ‌డం వ‌ల్ల కూడా మ‌న శ‌రీరంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. మ‌న శ‌రీరంలో అన్ని అవ‌య‌వాలు స‌క్ర‌మంగా ప‌నిచేస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

Admin

Recent Posts