హెల్త్ టిప్స్

Taking Pills : ఈ రెండు చిట్కాల‌ను పాటిస్తే.. చేదుగా ఉన్న ట్యాబ్లెట్ల‌ను సైతం ఈజీగా మింగేయ‌వ‌చ్చు..!

Taking Pills : మనకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్లచే పరీక్ష చేయించుకుని వారు రాసే మందులను తెచ్చుకుని మింగుతుంటాం. దీంతో ఆ అనారోగ్య సమస్యల నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది. వాటి నుంచి మనం బయటపడతాం. అయితే దాదాపుగా ఏ టానిక్ లేదా మందు బిళ్ల అయినా సరే.. చేదుగానే ఉంటుంది. దీంతో ఆ చేదు మందులను మింగాలంటే కొందరు జంకుతుంటారు. అయితే అసలు నిజానికి ఏ మందు బిళ్లలనైనా ఎలా మింగాలో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం.

మందు బిళ్లను మింగేందుకు మనకు రెండు ఉత్తమమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి.. ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలి. అందులో తగింత నీరు నింపుకోవాలి. మీరు మింగాలనుకునే టాబ్లెట్‌ను నాలుక మీద పెట్టుకోవాలి. రుచికళిలకు దూరంగా నాలుకపై టాబ్లెట్‌ను ఉంచాలి. లేదంటే చేదు తగులుతుంది. అనంతరం బాటిల్ ఓపెనింగ్‌ను పెదాలకు దగ్గరగా పెట్టుకుని పెదాలను ఆ ఓపెనింగ్ చుట్టూ బిగించి నీటిని తాగాలి. అలా నోట్లోకి గాలి చొరబడకుండా టాబ్లెట్‌ను మింగాలి.

taking pills is very easy if you follow these steps

ఇక టాబ్లెట్లను మింగేందుకు మరొక పద్ధతి.. టాబ్లెట్‌ను నాలుక మీద పెట్టుకోవాలి. నీళ్లను ఒక సిప్ వేసి కొంత నీటిని నోట్లోకి తీసుకోవాలి. కానీ టాబ్లెట్‌ను మింగకూడదు. గడ్డాన్ని కొద్దిగా కిందకు దించాలి. ఆ తరువాత తల కిందకు వంగగానే టాబ్లెట్‌ను, నీటిని కలిపి మింగాలి. ఇప్పుడు చెప్పిన రెండు పద్ధతులు టాబ్లెట్లను మింగేందుకు అనువైనవి. వీటి ద్వారా 80 శాతం వరకు టాబ్లెట్లను చాలా సులభంగా మింగవచ్చు. అయితే టాబ్లెట్లను బాగా మింగగలిగే వారు ఈ పద్ధతులను పాటించాల్సిన పనిలేదు. తమకు తోచినట్లుగా టాబ్లెట్లను మింగవచ్చు. అదే టాబ్లెట్లను మింగేందుకు జంకే వారు ఈ పద్ధతులను పాటించవచ్చు. కానీ ఈ కొత్త పద్ధతులను పాటించే ముందు ఎందుకైనా మంచిది.. జాగ్రత్త వహించండి.. పక్కనే ఎవరైనా ఉండేట్లు చూసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి టాబ్లెట్లు గొంతులో ఇరుక్కుని (చోకింగ్) ప్రాణాలు పోయేందుకు అవకాశం ఉంటుంది. కనుక టాబ్లెట్లను మింగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Admin

Recent Posts