వైద్య విజ్ఞానం

Heart Attack : గుండె పోటు వ‌చ్చేందుకు 2, 3 రోజుల ముందే ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.. అవి ఇవే..!

Heart Attack : ప్ర‌స్తుత త‌రుణంలో హార్ట్ ఎటాక్ లు అనేవి అత్యంత స‌హ‌జం అయిపోయాయి. చాలా మంది గుండె పోటు బారిన ప‌డుతూ ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ప‌లు కార‌ణాల వ‌ల్ల చాలా మందికి హార్ట్ ఎటాక్ లు వ‌స్తున్నాయి. అయితే గుండె పోటు అనేది స‌డెన్‌గా వ‌చ్చిన‌ప్ప‌టికీ అది వ‌చ్చేందుకు 2, 3 రోజుల ముందే మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించ‌డం ద్వారా గుండె పోటు వ‌చ్చే ప్ర‌మాదాన్ని ముందే ప‌సిగ‌ట్ట‌వ‌చ్చు. దీంతో ప్రాణాల‌ను కాపాడుకోవ‌చ్చు. మ‌రి గుండె పోటు వ‌చ్చే ముందు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. గుండె పోటు వ‌చ్చేందుకు రెండు, మూడు రోజుల ముందే కొంద‌రిలో ప‌లు లక్ష‌ణాలు క‌నిపిస్తాయి. చిన్న ప‌ని చేసినా బాగా అల‌సిపోతుంటారు. శ‌క్తి లేన‌ట్లు అనిపిస్తుంది. అస‌లు న‌డ‌వ‌డానికే శ‌క్తి లేన‌ట్లు అవుతుంది. ఇలా అవుతుంటే క‌చ్చితంగా గుండె పోటు వ‌స్తుంద‌ని అర్థం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా జాగ్ర‌త్త ప‌డాలి.

heart attack symptoms that occur 2 or 3 days before heart attack symptoms that occur 2 or 3 days before

2. గుండె పోటు వ‌చ్చే ముందు కొంద‌రికి ఛాతిపై బ‌లంగా ప‌ట్టేసిన‌ట్లు అవుతుంది. ఛాతిపై బ‌రువు పెట్టిన‌ట్లు ఉంటుంది. శ్వాస ఆడ‌డం క‌ష్టంగా ఉంటుంది. ఇది క‌చ్చితంగా గుండెపోటు సంకేత‌మే. ఇలా ఉంటే వెంట‌నే అప్ర‌మ‌త్తం అవ్వాలి. డాక్ట‌ర్‌ను క‌లిసి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ఏదైనా ఉంటే ముందే తెలిసిపోతుంది. అప్పుడు ప్రాణాల‌ను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.

3. గుండె పోటు వ‌స్తుంద‌న‌డానికి మ‌రో సంకేతం.. చెమ‌టలు.. గుండె పోటు వ‌చ్చేవారికి చెమ‌ట‌లు విప‌రీతంగా ప‌డుతుంటాయి. ఫ్యాన్ తిరుగుతున్నా సరే చెమ‌ట‌లు వ‌స్తుంటే.. అది క‌చ్చితంగా గుండె పోటుకు సంకేత‌మ‌నే భావించాలి.

4. వికారం, త‌ల‌తిర‌గ‌డం, ఎడ‌మ వైపు భుజం, మెడ‌, ద‌వ‌డ‌, చేయి నొప్పితో ఉండ‌డం.. వంటివ‌న్నీ గుండెపోటు వ‌చ్చే ముందు క‌నిపించే ల‌క్ష‌ణాలే. క‌నుక ఈ ల‌క్ష‌ణాలు ఉంటే నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ఒక‌వేళ ఏదైనా స‌మ‌స్య ఉంటే ముందుగానే గుర్తించి అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోవచ్చు. దీంతో గుండె సుర‌క్షితంగా ఉంటుంది. ప్రాణాల‌ను కాపాడుకున్న‌వార‌మ‌వుతాము.

Admin

Recent Posts