ఈ విశాల ప్రపంచంలో అద్భుతాలకి కొదవ లేదు. భూమి, సూర్యచంద్రుల కక్ష్యలు ఎప్పుడు మనల్ని అబ్బురపరుస్తూనే ఉంటాయి. ప్రకృతిలో దాగి ఉన్న వింతలను తెలుసుకోడాని నిత్యం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉంటారు. మరోవైపు ప్రజలు కూడా ఆ వింతలపై ఆసక్తి చూపిస్తుంటారు. భూమి చుట్టుకొలత, ఆకాశం మరియు భూమి మధ్య దూరం.. సముద్ర మట్టం మరియు ఎత్తైన పర్వత శ్రేణులు వంటి అనేక భౌగోళిక అధ్యయనాల గురించి అనేక విషయాలు మనల్ని ఎప్పటికప్పుడు సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తూ ఉంటాయి. వీటికి సంబంధించిన ప్రశ్నలు పరీక్షలలో కూడా అడుగుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.
సూర్యోదయం, సూర్యాస్తమయం చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. ఆ ఉదయం, సాయంత్రం వేళలుు మనసకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. అయితే, భారతదేశంలోని కొన్ని ప్రదేశాల్లో సూర్యాస్తమయం చాలా అందంగా కనువిందు చేస్తుంది. ఈ ప్రపంచంలో సూర్యుడు ముందుగా ప్రకాశించే దేశం ఏంటో తెలుసా? జపాన్ అని అంటారు. తూర్పుదేశంగా ఉన్న జపాన్ లోనే తొలిసారిగా సూర్యకిరణాలు పడతాయి. మరి, మన దేశానికి వచ్చినప్పుడు.. భానుడు తొలిగా ఉదయించేది ఏ రాష్ట్రంలో అనేది చూస్తే.. ఈ ప్రశ్నకు అరుణాచల్ ప్రదేశ్ అని సమాధానం వినిపిస్తుంది.. మరి, అరుణాచల్ ప్రదేశ్ లో ఏ ఊరిలో తొలిగా సూర్యుడు ఉదయిస్తాడు? అంటే డాంగ్ లో మొదటి భానుడి కిరణాలు పడతాయి.
ఆ తర్వాత పొద్దు పొడుస్తున్న కొద్దీ.. (అంటే భూమి ముందుకు తిరుగుతున్న కొద్దీ) ఒక్కో ఊరు నిద్ర లేస్తుందన్నమాట. అయితే.. ఇతర ప్రాంతాల్లోని వారికి ఆశ్చర్యం ఎప్పుడు కలిగిస్తుందంటే.. టైమ్ తో పోల్చి చూసుకున్నప్పుడు వింతగా అనిపిస్తుంది. ఈ పట్టణాన్ని జపాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. డాంగ్ అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజోలో సముద్ర మట్టానికి 1,200 మీటర్ల ఎత్తులో నది మరియు పర్వతాలతో చుట్టుముట్టబడిన గ్రామం. ఇది చైనా మరియు మయన్మార్ మధ్య ఉంది. బ్రహ్మపుత్ర నదికి ఉపనది అయిన లోహిత్ సంగమం దీని శోభను పెంచుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ డాంగ్ గ్రామంలో సూర్యుడు గంట ముందుగానే ఉదయిస్తాడు. అలాగే సూర్యుడు గంట ముందుగా అస్తమిస్తాడు. అందుకే ఈ ప్రాంతం పర్యాటకులలో ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ నుంచి అరుణా చల్ ప్రదేశ్ లోని దోంగ్ గ్రామం 3 వేల 148 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కారణం వల్లనే.. అక్కడ 5 గంటలకు పొద్దు పొడిస్తే.. మన వంతు వచ్చే సరికి 6 దాటిపోతుంది.