18 ఏళ్లు పైబ‌డిన వారికి నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటే మంచిదో తెలుసా ?

అప్పుడే పుట్టిన శిశువుల నుంచి వృద్ధుల వ‌ర‌కు ఒక్కొక్క‌రికీ గుండె కొట్టుకునే వేగం ఒక్కోలా ఉంటుంది. అయితే 18 ఏళ్లు పైబ‌డిన వారిలో గుండె కొట్టుకునే వేగం స‌హ‌జంగానే నిమిషానికి 60-100 బీట్స్ ఉంటుంది. చాలా మందికి గుండె నిమిషానికి 60 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. కానీ స్త్రీ, పురుషులు ఎవ‌రికైనా స‌రే గుండె కొట్టుకునే వేగం ఎంత ఉంటే ఆరోగ్య‌క‌ర‌మో, ఆరోగ్యంగా ఉండాలంటే నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలో, ఏది క‌రెక్ట్ రేట్ ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

how many beats per minute is healthy for our heart

18 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి స్త్రీ, పురుషుల‌కు గుండె కొట్టుకునే వేగం మారుతుంది. ఎలాంటి వ్యాయామం చేయ‌కుండా సాధార‌ణ స్థితిలో ఉన్న‌ప్పుడు గుండె కొట్టుకునే వేగాన్ని లెక్కించాలి. దాన్నే రెస్టింగ్ హార్ట్ రేట్ అంటారు. ఇక ఆ హార్ట్ రేట్ ఈ విధంగా ఉండాలి.

పురుషులు

* 18 ఏళ్ల‌కు పైబ‌డిన పురుషులు అథ్లెట్లు, క్రీడాకారులు, వ్యాయామం ఎక్కువ‌గా చేసేవారు అయితే వారి గుండె నిమిషానికి 49 నుంచి 55 సార్లు కొట్టుకుంటుంది.

* 18 ఏళ్ల‌కు పైబ‌డిన పురుషులకు గుండె నిమిషానికి 66 నుంచి 69 సార్లు కొట్టుకుంటే వారు ఆరోగ్యంగా ఉన్న‌ట్లు లెక్క‌.

* 18 ఏళ్ల‌కు పైబ‌డిన పురుషులకు గుండె నిమిషానికి 80 సార్ల‌కు పైగా కొట్టుకుంటుంది అంటే వారు జాగ్ర‌త్త వ‌హించాలి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

స్త్రీలు

* 18 ఏళ్ల‌కు పైబ‌డిన స్త్రీలు అథ్లెట్లు, క్రీడాకారులు, వ్యాయామం ఎక్కువ‌గా చేసేవారు అయితే వారి గుండె నిమిషానికి 54 నుంచి 59 సార్లు కొట్టుకుంటుంది.

* 18 ఏళ్ల‌కు పైబ‌డిన స్త్రీలకు గుండె నిమిషానికి 70 నుంచి 72 సార్లు కొట్టుకుంటే వారు ఆరోగ్యంగా ఉన్న‌ట్లు లెక్క‌.

* 18 ఏళ్ల‌కు పైబ‌డిన స్త్రీలకు గుండె నిమిషానికి 83 సార్ల‌కు పైగా కొట్టుకుంటుంది అంటే వారు జాగ్ర‌త్త వ‌హించాలి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

Admin

Recent Posts