మన శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి. ఒక్కో భాగం ఒక్కో పనిచేస్తుంది. అందువల్ల వాటికి అవసరం అయ్యే పోషకాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఈ క్రమంలోనే అన్ని అవయవాలు ఆరోగ్యంగా పనిచేయాలంటే అన్ని పోషకాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మన శరీరంలో ఏయే అవయవాలకు ఏయే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
* వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు, ఆకుకూరలు, బీన్స్, చేపలను తీసుకోవాల్సి ఉంటుంది.
* మెదడు యాక్టివ్‌గా పనిచేయాలంటే వాల్ నట్స్, బాదంపప్పు, చేపలను తీసుకోవాలి.
* కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కజొన్న, క్యారెట్లు, కోడిగుడ్లను తీసుకోవాలి.
* కండరాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే అరటి పండ్లు, మటన్, కోడిగుడ్లను తీసుకోవాలి.
* చర్మం కోసం గ్రీన్ టీ, నిమ్మ, చెర్రీలు, బొప్పాయి వంటి ఆహారాలను తీసుకోవాలి.
* ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం బెల్లం, మొలకెత్తిన గింజలను తీసుకుంటుండాలి.
* ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే నట్స్, పాలు, కోడిగుడ్లు, చేపలు, నారింజ పండ్లను తింటుండాలి.
* జీర్ణ వ్యవస్థ పనితీరుకు పెరుగు లేదా మజ్జిగ, ద్రాక్ష, జామ పండ్లు వంటి ఆహారాలను తీసుకుంటుండాలి.
* గుండె ఆరోగ్యంగా ఉండాలంటే టమాటాలు, క్యారెట్లు, యాపిల్స్ వంటి ఆహారాలను తీసుకోవాలి.
ఇలా ఒక్కో అవయవం ఆరోగ్యంగా ఉండాలంటే భిన్న రకాల ఆహారాలను తరచూ తీసుకుంటుండాలి. దీంతో అన్ని పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.