Immunity Power : మన శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేదా వ్యాధి వచ్చినా తట్టుకోగలుగుతాం. దీంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే రోగ నిరోధక శక్తి తగ్గితే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. ఇది ప్రాణాల మీదకు కూడా తెస్తుంది. అయితే రోగ నిరోధక శక్తి తగ్గిందని ఎలా తెలుసుకోవాలి ? అందుకు మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ? అంటే..
మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గితే మనకు పలు లక్షణాలు కనిపిస్తాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే ఎల్లప్పుడూ అలసటగా అనిపిస్తుంది. ఏ పనిచేయలేకపోతుంటారు. శక్తి లేనట్లుగా, నీరసంగా అనిపిస్తుంది. బద్దకంగా ఉంటారు. ఉత్సాహం తగ్గుతుంది. అలాగే తరచూ దగ్గు, జలుబు, జ్వరం, ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి.
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఒత్తిడి ఎల్లప్పుడూ అధికంగా ఉంటుంది. అలాగే తరచూ జీర్ణ సమస్యలు వస్తుంటాయి. గాయాలు అంత త్వరగా మానుతాయి. గాయాలు, పుండ్లు మానేందుకు ఆలస్యం అవుతుంటుంది. ఇవన్నీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే కనిపించే లక్షణాలే. అయితే పలు ఆహారాలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
ఆహారంలో పసుపు, మిరియాలు, అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు వంటి వంట ఇంటి దినుసులను చేర్చుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని అమాంతం పెంచుతాయి. అలాగే విటమిన్ ఎ, సి, డి, ఇలు అధికంగా ఉంటే ఆహారాలను తీసుకోవాలి. క్యారెట్లు, గుమ్మడికాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా సీడ్స్, అవిసె గింజలు, బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్, కోడిగుడ్లు, చికెన్, మటన్, పాలకూర.. తదితర ఆహారాలను తరచూ తీసుకుంటే రోగ నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. దీంతో పైన తెలిపిన లక్షణాలు తగ్గిపోతాయి. అప్పుడు రోగ నిరోధక శక్తి పెరిగిందని అర్థం చేసుకోవాలి. ఇలా రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు.