Krithi Shetty : బేబ‌మ్మ‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. బాలీవుడ్ మూవీలో చాన్స్‌..?

Krithi Shetty : గ‌డిచిన ఏడాది కాలంలో అత్యంత ఎక్కువ స‌క్సెస్‌ను సాధించిన హీరోయిన్ల‌లో.. కృతి శెట్టి ఒక‌రని చెప్ప‌వ‌చ్చు. ఈమె న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు వంటి చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో ఈమెకు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు చిత్రాల‌తో కృతిశెట్టి ఎంతో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు తాజాగా ఓ బాలీవుడ్ సినిమాలో న‌టించే చాన్స్ వ‌చ్చింద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో ఆ మూవీ షూటింగ్ కూడా జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది.

Krithi Shetty reportedly got chance in Bollywood movie
Krithi Shetty

కృతి శెట్టి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఎంతో బిజీగా ఉంది. ఈమె ప్ర‌స్తుతం రామ్‌తో క‌లిసి ది వారియ‌ర్ అనే చిత్రంలో న‌టిస్తోంది. అలాగే నితిన్‌తో మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలోనూ యాక్ట్ చేస్తోంది. అలాగే ప్ర‌భాస్‌తో క‌లిసి మారుతి తెర‌కెక్కించ‌నున్న సినిమాలోనూ ఈమెకు చాన్స్ వ‌చ్చింద‌ని అంటున్నారు. ఇక తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం కృతి శెట్టి త్వ‌ర‌లో బాలీవుడ్‌లో షాహిద్ క‌పూర్‌తో క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తుంద‌ని తెలుస్తోంది.

తెలుగులో ఆమె నాని ప‌క్క‌న నటించిన శ్యామ్ సింగ‌రాయ్ చిత్రాన్ని షాహిద్ క‌పూర్ హీరోగా హిందీలో రీమేక్ చేయ‌నున్నార‌ట‌. అందులో కృతిశెట్టిని తీసుకోవాల‌ని ఆ చిత్ర యూనిట్ భావిస్తున్న‌ద‌ట‌. శ్యామ్ సింగ‌రాయ్‌లో కృతి చేసిన రోల్‌నే ఆమెకు హిందీలో ఇవ్వ‌నున్నార‌ట‌. దీంతో ఆమెకు మ‌రింత సుల‌భం కానుంది. అయితే దీనికి ఆమె అంగీక‌రించింద‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక శ్యామ్ సింగ‌రాయ్‌లో నానితో క‌లిసి కృతి శెట్టి ఓ లిప్‌లాక్ సీన్‌లో పాల్గొంది. మ‌రి హిందీ రీమేక్‌లోనూ ఆ విధంగా చేస్తుందో.. లేదో.. చూడాలి.

Editor

Recent Posts