Left Side Sleeping : నిద్ర‌పోయేట‌ప్పుడు ఎడమ‌వైపు తిరిగి ప‌డుకుంటున్నారా.. అయితే మీ శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Left Side Sleeping : ప్ర‌తి ఒక్క‌రికి నిద్ర చాలా అవ‌స‌రం. మనం శ‌రీరానికి త‌గినంత నిద్ర పోతేనే ఆరోగ్యంగా, చురుకుగా ఉండ‌గ‌లం. లేదంటే మ‌న‌ల్ని అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. నిద్ర ఎలా అయితే మ‌న ఆరోగ్యం మీద ప్ర‌భావాన్ని చూపుతుందో అలాగే మ‌నం నిద్రించే భంగిమ‌ కూడా మ‌న ఆరోగ్యం పై మంచి లేదా చెడు ప్ర‌భావాన్ని చూపుతుంది. ఈ ప్ర‌భావం మ‌న మెద‌డు, జీర్ణాశ‌యం మీద ఎక్కువ‌గా ఉంటుంది. ఒక మంచి నిద్ర మ‌న శ‌రీరానికి శ‌క్తిని, చురుకుద‌నాన్ని ఇస్తుంది. ఒక గాఢ నిద్ర వ‌ల్ల మ‌నం రోజంతా అల‌స‌ట లేకుండా చురుకుగా ప‌ని చేసుకోవ‌చ్చు. మంచి నిద్ర ఎంత ఆరోగ్యానికి ఎంత అవ‌స‌ర‌మో మ‌నం నిద్రిచేట‌ప్పుడు మ‌న శ‌రీరం ఉండే స్థితి కూడా మ‌న ఆరోగ్యానికి అంతే అవ‌స‌రం. మ‌న‌లో చాలా మందికి అస‌లు ఎలా నిద్రించాలో కూడా తెలియ‌దు. స‌రైన స్థితిలో నిద్రించ‌క‌పోవ‌డం వ‌ల్ల నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌దు. అలాగే త‌ర‌చూ మెలుకువ వ‌స్తూ ఉంటుంది.

అలాగే నిద్ర‌లో మెడ‌, భుజాలు నొప్పి పెడుతూ ఉంటాయి. అలాగే మ‌నం నిద్రించే భంగిమ మ‌న జీర్ణాశ‌యంపై కూడా చాలా ప్ర‌భావాన్ని చూపిస్తుంది. స‌రిగ్గా నిద్ర‌పోక‌పోవ‌డం వ‌ల్ల ఉద‌యం లేచిన వెంట‌నే చాలా బ‌ద్ద‌కంగా ఉంటుంది. అలాగే పొట్ట కూడా పూర్తిగా శుభ్రం కాక మ‌నం ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ బారిన ప‌డాల్సి వ‌స్తుంది. మ‌నం ఏ భంగిమ‌లో నిద్రిస్తే మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న‌లో చాలా మందికి బోర్లా ప‌డుకునే అల‌వాటు ఉంటుంది. ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన భంగిమ‌. ఇలా అస్స‌లు నిద్రించ‌కూడ‌దు. ఆస్థ‌మా ఉన్న వారు ఇలా అస్స‌లు నిద్రించ‌కూడ‌దు. ఇలా నిద్రించ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల మీద అలాగే పొట్ట మీద ఎక్కువ‌గా, వెన్ను పూస ఎముక‌ల మీద‌ ఒత్తిడి ప‌డుతుంది. దీంతో మ‌నం నిద్ర‌పోయేట‌ప్పుడు శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతుంది.

Left Side Sleeping what happens when you do that
Left Side Sleeping

ఇలా బోర్లా ప‌డుకోవ‌డం వ‌ల్ల న‌డుము నొప్పి అలాగే జీర్ణ సంబంధిత స‌మ‌స్యలు వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంది. అదేవిధంగా కొంద‌రు కుడి చేయివైపు తిరిగి ప‌డుకుంటారు. ఇలా నిద్రించ‌డం కూడా అస్స‌లు మంచిది కాదు. ఇలా నిద్రించ‌డం వ‌ల్ల మ‌న జీర్ణాశ‌యంపై చెడు ప్ర‌భావం ప‌డుతుంది. ఇలా నిద్రించ‌డం వ‌ల్ల గ్యాస్, ఎసిడిటీ, పుల్ల‌టి త్రేన్పులు, మ‌ల‌బ‌ద్దకం, క‌డుపుఉబ్బ‌రం, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇక కొంద‌రు ఎడ‌మ చేతి వైపు తిరిగి ప‌డుకుంటారు. ఇలా నిద్రించ‌డం అన్నింటి కంటే ఉత్త‌త‌మ‌మైన‌ది. ఎడ‌మ చేతి వైపు నిద్రించ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఇలా నిద్రించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో అవ‌య‌వాలు స‌హ‌జంగా శుభ్ర‌ప‌డ‌తాయి. వ్యాధులు, అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. ఎడ‌మ చేతివైపు తిరిగి నిద్రించ‌డం వ‌ల్ల ర‌క్తంలో ఉండే విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి. జీర్ణాశ‌యం చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. ఇలా నిద్రించ‌డం వ‌ల్ల మ‌నం తిన్న భోజ‌నం చాలా సుల‌భంగా పెద్ద ప్రేగులోకి ప్ర‌వేశిస్తుంది.

ఇలా నిద్రించ‌డం వ‌ల్ల ఉద‌యం పూట పొట్ట చాలా సుల‌భంగా శుభ్ర‌ప‌డుతుంది. గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు, గ‌ర్భిణీ స్త్రీలు ఎడ‌మ వైపు తిరిగి నిద్రించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ, క‌డుపు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు, న‌డుము నొప్పి, వెన్ను నొప్పి వంటి నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు ఎడ‌మ వైపు తిరిగి నిద్రించ‌డం ఆయా స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఇలా నిద్రించ‌డం వ‌ల్ల ఎక్కువ స‌మ‌యం నిద్రించ‌వ‌చ్చు. శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు, ఎక్కువ‌గా గుర‌క‌పెట్టే వారు ఎడ‌మ వైపు చేతి వైపు తిరిగి నిద్రించ‌డం మంచిది. ఎడ‌మ చేతి వైపు తిరిగి నిద్రిస్తే మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని ఇలా నిద్రించ‌డం ప్ర‌తి ఒక్క‌రు అల‌వాటు చేసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

D

Recent Posts