Tingling : సాధారణంగా ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం వల్ల, చేతులు ముడుచుకుని పడుకోవడం వల్ల చేతులు, కాళ్లు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఈ తిమ్మిర్లు రెండు నుండి మూడు నిమిషాల పాటు ఉండి తగ్గిపోతూ ఉంటాయి. ఇది సాధారణంగా అందరిలో జరుగుతూ ఉంటుంది. నరాల్లో రక్తప్రసరణ సాఫీగా జరగకపోవడం వల్ల తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. కానీ కొందరిలో ఈ తిమ్మిర్లు తరచూ రావడం అలాగే తిమ్మిర్లు ఎక్కువ సేపు ఉండడం జరుగుతుంది. ఇలా తిమ్మిర్లు తరచూ వస్తూ ఉంటే మాత్రం దీనిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. మద్యం తాగే వారిలో, షుగర్ వ్యాధితో బాధపడే వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. తిమ్మిర్లు తరచూ రావడానికి ప్రధాన కారణం మన శరీరంలో విటమిన్ బి 12 లోపించడమే.
మన శరీరంలో విటమిన్ బి 12 కీలక పాత్ర పోషిస్తుంది. శరీర ఎదుగుదలలో, ఎర్ర రక్తకణాల తయారీలో, నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో విటమిన్ బి 12 మనకు సహాయపడుతుంది. విటమిన్ బి 12 లోపించడం వల్ల శరీరంలో తగినన్ని ఎర్ర రక్తకణాలు తయారవ్వవు. దీంతో అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరగదు. ఆక్సిజన్ సరఫరా సరిగ్గా లేన్నందున తరచూ తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. విటమిన్ బి 12 లోపించడం వల్ల నరాల్లో వాపులు, తిమ్మిర్లు, వెరికోస్ వెయిన్స్, సయాటికా నొప్పులు వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కనుక శరీరానికి తగినంత విటమిన్ బి 12 ను అందించడం చాలా అవసరం.
విటమిన్ బి 12 ను మనం క్యాప్సుల్స్ రూపంలో తీసుకోవచ్చు. అలాగే మనం తీసుకునే ఆహార ద్వారాల కూడా మనం శరీరానికి తగినంత విటమిన్ బి 12 ను అందివచ్చు. అయితే కొందరిలో విటమిన్ బి 12 ఉండే ఆహారాలను తీసుకున్నప్పటికి వారిలో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. విటమిన్ బి 12 లోపం కూడా తలెత్తుతూ ఉంటుంది. మన జీర్ణవ్యవస్థ సరిగ్గా లేకపోతే మనం ఆహారాన్ని తీసుకున్నప్పటికి కూడా విటమిన్ బి 12 లోపం వస్తుంది. జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేన్నందున్న మనం తీసుకునే విటమిన్ బి 12 మూత్రం బయటకు వెళ్లిపోతుంది. కనుక మనం జీర్ణవ్యవస్థను బలంగా, ఆరోగ్యంగా తయారు చేసుకోవాలి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో మనకు ఆపిల్ సైడ్ వెనిగర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ రెండు పూటలా ఆపిల్ సైడ్ వెనిగర్ ను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. దీంతో మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలు మన శరీరానికి చక్కగా అందుతాయి.
నరాల తిమ్మిర్లు, వాపులు, అరి చేతులు, అరికాళ్లల్లో సూదులు గుచ్చుకున్నట్టు ఉన్న వారు విటమిన్ బి 12 ఉండే ఆహారాలను తీసుకుంటూనే ఆపిల్ సైడ్ వెనిగర్ ను కూడా తీసుకోవాలి. వఎటువంటి ఆహారాలను తీసుకోవడం వల్ల మనం విటమిన్ బి 12 లోపాన్ని అధిగమించవచ్చు అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ బి 12 మాంసం, పాలు, పాలు పదార్థాలు, చేపలు వంటి ఆహారాల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ బి 12 నీటిలో కరిగే విటమిన్. కనుక ఇది శరీరంలో నిల్వ ఉండదు. దీనిని ప్రతిరోజూ మన శరీరానికి అందించాల్సి ఉంటుంది. అలాగే తిమ్మిర్ల సమస్యతో బాధపడే వారు ఎక్కువగా నీటిని తాగాలి. శరీరం డీ హైడ్రేషన్ కు గురి కాకుండా చూసుకోవాలి. అలాగే చేతులకు, కాళ్లకు కొబ్బరి నూనెతో 5 నుండి 10 నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. దీంతో రక్తప్రసరణ మెరుగుపడి తిమ్మిర్లు రాకుండా ఉంటాయి.