వైద్య విజ్ఞానం

గుండెపోటు వస్తుందో రాదో వేలిని చూసి చెప్పొచ్చు!

గుండెపోటు ఎప్పుడు, ఎవరికి వస్తుందో చెప్పలేము. చాలామంది చనిపోవడానికి కారణం గుండెపోటని చెబుతుంటారు. అసలు ఈ గుండెపోటు ఎందుకు వస్తుంది. వచ్చే ముందు ఏదైనా సంకేతాన్ని తెలియజేస్తుందా అన్న అంశాలపై ఓ పరిశోధనలో వ్యక్తి చేతివేళ్లను బట్టి గుండెపోటు వస్తుందో రాదో ముందుగానే చెప్పొచ్చని తేలింది. యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్‌కు చెందిన బయోలాజికల్ సైంటిస్టులు గుండెపోటు వచ్చిన 151 మందిపైన పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో చేతివేళ్లను బట్టి గుండె జబ్బులు వస్తాయో రావో అన్న విషయాన్ని తెలియజేశారు. ఈ 151 మందికి చేసిన చికిత్సలో ఎలాంటి ఫలితాలు వచ్చాయో తెలుసుకుందాం..

చూపుడు వేలు, ఉంగరం వేలు రెండూ సమానంగా ఉన్నవారికి గుండెపోటు రావడం చాలా కష్టమని వెల్లడించారు. ఉంగరం వేలి కంటే చూపుడు వేలు పొడవుగా ఎవరికైతే ఉంటుందో.. వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. అంతేకాదు, వయసు కూడా 35 నుంచి 80 సంవత్సరాలు గలవారికి ఈ సమస్య ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేల్చిచెప్పారు. స్థూలకాయం ఉన్నవారు, జంక్‌ఫుడ్ ఎక్కువగా తినేవారికి, ఒత్తిడి అధికంగా ఉన్నవారికి గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఈ సమస్యల‌ నుంచి విముక్తి పొందేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

you can tell if a person gets heart attack or not by looking at their fingers

శ్వాస ఆడకపోవడం, గాలి పీల్చుకోవడంలో తరచూ ఇబ్బందులు వస్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ లక్షణంగా అనుమానించాలి. విపరీతంగా అలసిపోవడం, ఒళ్లంతా నొప్పులుగా ఉండడం వంటి లక్షణాలు తరచూ కనిపిస్తుంటే వాటిని అశ్రద్ధ చేయకూడదు. మత్తుగా నిద్రవస్తున్నా, అధికంగా చెమటలు పడుతున్నా అనుమానించాల్సిందే. పొగ తాగేవారు, మద్యం సేవించేవారు, డయాబెటిస్, హైబీపీ, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారికి గుండెపోటు రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. వీలైనంత వరకు వీటిని తగ్గించుకుంటే గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయటపడ‌వ‌చ్చు.

Admin

Recent Posts