mythology

Krishna And Arjuna : కృష్ణుడు, అర్జునుడు మంచి మిత్రులు.. మరి వారిద్దరూ ఎందుకు యుద్ధం చేశారు..? కారణం ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Krishna And Arjuna &colon; శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీకృష్ణావతారం కూడా ఒకటి&period; శ్రీకృష్ణుడంటే సాక్షాత్తూ మహా విష్ణువు స్వరూపమే&period; చాలా శక్తివంతమైన ప్రజల కోరికలు తీర్చే దైవంగా కృష్ణుడు పూజలందుకుంటున్నాడు&period; అలాగే మహాభారతంలో అర్జునుడు చాలా శక్తివంతమైన యోధుడు&period; ప్రపంచంలో బాణాలు వేసే అస్త్ర విద్యను ప్రదర్శించడంలో అర్జునుడికి మించిన వాడు లేడంటారు&period; అయితే మహాభారతంలో ఇద్దరూ మంచి స్నేహితులే కాదు&comma; బావమరుదులు కూడా&period; కానీ అలా కలిసి ఉన్న వారే ఒకసారి పరస్పరం యుద్ధానికి దిగారు తెలుసా&period; అవును&comma; మీరు విన్నది నిజమే&period; శ్రీకృష్ణుడు&comma; అర్జునుడు ఇద్దరూ ఓ సారి యుద్ధం చేశారు&period; అప్పుడు ఏమైందంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అతని పేరు గయుడు&period; ఓ గంధర్వుడు&period; ఆకాశ మార్గంలో ఓ రోజున ప్రయాణిస్తూ కిందకు ఉమ్ముతాడు&period; అయితే అదే సమయంలో కింద నదిలో శ్రీకృష్ణుడు సంధ్యా వందనం చేస్తుంటాడు&period; దోసిలిలో నీటిని పట్టి సూర్యున్ని ప్రార్థిస్తుంటాడు&period; అదే సమయంలో గయుడు ఉమ్మి వేసే సరికి అది నేరుగా వచ్చి కృష్ణుని దోసిలిలో పడుతుంది&period; దీంతో శ్రీకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గయున్ని చంపేస్తానని ప్రతిన బూనుతాడు&period; అది తెలుసుకున్న గయుడు గజ గజ వణుకుతాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60578 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lord-sri-krishna-2&period;jpg" alt&equals;"why lord sri krishna and arjuna fight despite they are friends " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గయుడు వెంటనే నారదుని వద్దకు వెళ్లి సలహా అడుగుతాడు&period; అప్పుడు నారదుడు గయున్ని అర్జునుడి దగ్గరకు వెళ్లి మొదట శరణు కోరమని&comma; తరువాతే కృష్ణుడి పేరు చెప్పమని అంటాడు&period; గయుడు అలాగే చేస్తాడు&period; మొదట అర్జునుడి వద్దకు వెళ్లి శరణు కోరుతాడు&period; అలా అర్జునుడి నుంచి గయుడు మాట తీసుకున్నాకే తనను కృష్ణుడు చంపుతానని చెప్పాడని&comma; తనను కాపాడమని అర్జునున్ని వేడుకుంటాడు&period; దీంతో మొదట విస్తుపోయిన అర్జునుడు ఇచ్చిన మాటకు కట్టుబడి గయుడి తరఫున కృష్ణుడితో యుద్ధం చేసేందుకు సిద్ధమవుతాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కృష్ణుడు&comma; అర్జునుడు ఇద్దరూ యుద్ధం చేయబోతున్నారని తెలిసి అటు రుక్మిణి&comma; ఇటు సుభద్రతోపాటు మరోవైపు నారదుడు కూడా ఇద్దరికీ సర్ది చెప్పాలని చూస్తారు&period; కానీ అర్జునుడు&comma; కృష్ణుడు వారి మాటలను వినకుండా యుద్ధం చేసేందుకు పూనుకుంటారు&period; ఈ క్రమంలో ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది&period; కృష్ణుడు వేసే అస్త్రాలను అర్జునుడు నాశనం చేస్తుంటాడు&period; అలాగే అర్జునుడు వేసే అస్త్రాలను కృష్ణుడు నాశనం చేస్తుంటాడు&period; ఇలాగైతే లాభం లేదనుకుని కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని అర్జునుడిపైకి సంధిస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-60577" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lord-sri-krishna-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు అర్జునుడు తనకు మహా శివుడు ఇచ్చిన పాశుపతాస్త్రాన్ని కృష్ణుడిపైకి పంపుతాడు&period; దీంతో ప్రపంచం నాశనం అవుతుందని గ్రహించిన బ్రహ్మ వెంటనే యుద్ధం జరిగే స్థలం వద్ద ప్రత్యక్షమై యుద్ధాన్ని ఆపాలని కోరగా&period;&period; కృష్ణుడు&comma; అర్జునుడు తాము వేసిన అస్త్రాలను వెనక్కి తీసుకుంటారు&period; అనంతరం బ్రహ్మ గయున్ని కృష్ణుడికి ఇచ్చేయమని అర్జునుడికి చెప్పగా అర్జునుడు గయున్ని కృష్ణుని వద్దకు పంపుతాడు&period; అప్పుడు కృష్ణుడు గయున్ని చంపుతాడు&period; అనంతరం బ్రహ్మ మళ్లీ కమండలంలో ఉండే జలాన్ని చల్లి గయున్ని బతికిస్తాడు&period; దీంతో అటు కృష్ణుడు&comma; ఇటు అర్జునుడు ఇద్దరి ప్రతిజ్ఞలు నెరవేరుతాయి&period; అయితే నిజానికి ఆ ఇద్దరి మధ్య జరిగిన యుద్ధాన్ని మనం నిత్య జీవితంలోకి కూడా అన్వయించుకోవచ్చు&period; ఎలాగంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఒక అభిప్రాయం ఉంటుంది&period; అందుకు అనుగుణంగానే ఏ మనిషి అయినా ముందుకు వెళతాడు&period; అలాంటి సమయాల్లో ఒక్కోసారి ఎవరికైనా తాము ప్రేమించే లేదా తమకు దగ్గరైన వారికి వ్యతిరేకంగా ముందుకు సాగాల్సి వస్తుంది&period; అలాంటప్పుడు ఎవరైనా తమకు తోచిన రీతిలో ఏది కరెక్ట్‌ అనుకుంటే దాని వైపు ముందుకు వెళ్లాలి&period; అప్పుడు తమ కుటుంబ సభ్యులు అడ్డుగా వచ్చినా సరే&period;&period; తాము అనుకున్న అంశం వైపే నిలబడాలి&period; ఇదే విషయాన్ని శ్రీకృష్ణార్జుల యుద్ధం మనకు తెలుపుతుంది&period; ఇక కృష్ణుడు మహాభారత యుద్ధానికి సన్నాహకంగా కూడా అర్జునుడితో అలా యుద్ధం చేశాడని పురాణాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts