Afghani Egg Curry : మనం కోడిగుడ్లతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్లతో చేసే వంటకాలను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. కోడిగుడ్డుతో వంటకాలను తయారు చేయడం కూడా చాలా సులభం. కోడిగుడ్డుతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ కూడా ఒకటి. ఈ ఎగ్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎవరైనా ఈ కూరను చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. కోడిగుడ్లతో ఎంతో రుచిగా ఉండే ఆఫ్ఘనీ ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 2, తరిగిన టమాటాలు – 200 గ్రా., తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్.
ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి టమాట ముక్కలను మెత్తగా ఉడికించాలి. టమాట ముక్కలు ఉడికిన తరువాత కోడిగుడ్లను ఒక్కొక్కటిగా విడివిడిగా కూరలో వేసుకోవాలి. వీటిని కదిలించకుండా అలాగే ఉంచాలి. ఇప్పుడు వీటిపై పచ్చిమిర్చి ముక్కలను వేసి కదిలించకుండా మూత పెట్టి ఉడికించాలి.
ఇలా 10 నిమిషాల పాటు ఉడికించిన తరువాత కోడిగుడ్డును నెమ్మదిగా మరో వైపుకు తిప్పుకుని మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కోడిగుడ్డుతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు.