Pockmarks : వీటిని రాస్తే చాలు.. చ‌ర్మంపై ఉండే రంధ్రాలు మొత్తం మాయ‌మ‌వుతాయి..!

Pockmarks : మ‌న వంటింట్లో ఉండే రెండు కూర‌గాయ‌ల‌ను ఉప‌యోగించి మ‌నం మ‌న ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే జిడ్డు, దుమ్ము, ధూళి, మృత‌క‌ణాల‌న్నీ తొల‌గిపోతాయి. ముఖంపై ఉండే జిడ్డు తొల‌గిపోతుంది. అలాగే చ‌ర్మంపై ఉండే రంధ్రాలు మూసుకుపోతాయి. ముఖంపై ఉండే న‌లుపు తొల‌గిపోయి ముఖం అందంగా మారుతుంది. ఈ చిట్కాను ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే దీనిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు కూడా ఉండ‌వు. మ‌న ముఖాన్ని సుల‌భంగా ఎలా అందంగా మార్చుకోవాలి.. మ‌నం ఉప‌యోగించాల్సిన ఆ రెండు కూర‌గాయ‌లు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఒక ట‌మాట‌ను, ఒక కీర‌దోస‌కాయ‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా కీర‌దోస‌ను, ట‌మాట‌ను ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. జిడ్డు చ‌ర్మం ఉన్న వారు ఇందులో నిమ్మ‌ర‌సాన్ని కూడా వేసుకోవ‌చ్చు. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ఐస్ ట్రేలో వేసుకుని డీఫ్రిజ్ లో ఉంచాలి. ఈ మిశ్ర‌మం ఐస్ క్యూబ్స్ లాగా మారిన త‌రువాత వాటిని తీసుకుని ముఖానికి రాసుకోవాలి. ఈ క్యూబ్స్ ను తీసుకుని స‌ర్క్యుల‌ర్ మోష‌న్ లో రుద్దుతూ ముఖానికి రాసుకోవాలి. అయితే దీనిని వాడే ముందు ముఖాన్ని శుభ్రంగా క‌డిగి తుడుచుకోవాలి.

Pockmarks home remedy works better how to apply
Pockmarks

త‌రువాత ఈ చిట్కాను ఉప‌యోగించాలి. ఇలా త‌యారు చేసుకున్న ఐస్ క్యూబ్స్ ను రుద్దుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మానికి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డుతుంది. చ‌ర్మంపై ఉండే జిడ్డు, న‌లుపు, మృత‌క‌ణాలు తొల‌గిపోతాయి. ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకోవ‌చ్చు.

D

Recent Posts