Honey For Beauty : ఒక చిన్న చిట్కాను వాడి మనం మన ముఖాన్ని తెల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడం అలాగే వాడడం కూడా చాలా సులభం. ఈ చిట్కాను వాడడం వల్ల ఎండ వల్ల నల్లగా మారిన ముఖాన్ని మనం చాలా సులభంగా తెల్లగా మార్చుకోవచ్చు. అలాగే ఈ చిట్కాను వాడడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి. ముఖంపై పేరుకుపోయిన ట్యాన్ తొలగిపోతుంది. అందవిహీనంగా నిర్జీవంగా మారిన ముఖం కూడా ఈ చిట్కాను వాడడం వల్ల అందంగా కాంతివంతంగా తయారవుతుంది. మన ముఖాన్ని తెల్లగా మార్చే ఆ చిట్కా ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం రెండు టీ స్పూన్ల అలోవెరా జెల్ ను, అర టీ స్పూన్ నిమ్మరసాన్ని, ఒక టీ స్పూన్ తేనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో కలబందజెల్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో తేనె, నిమ్మరసం వేసి కలపాలి. జిడ్డు చర్మం ఉన్న వారు మాత్రమే నిమ్మరసాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. పొడి చర్మం, సున్నితమైన చర్మం ఉన్న వారు నిమ్మరసాన్ని ఉపయోగించకపోవడమే మంచిది. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుని సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఆరిన తరువాత సబ్బు ఉపయోగించకుండా సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.
దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఎండ వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల నల్లగా మారిన చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. అలాగే ముఖంపై పేరుకుపోయిన మృతకణాలు కూడా తొలగిపోతాయి. కాంతిహీనంగా మారిన ముఖం అందంగా తయారవుతుంది. ఈ విధంగా ఈ చిట్కాను క్రమం తప్పకుండా వాడడం వల్ల చాలా సులభంగా మనం మన ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు.