Aloo Vepudu : ఆలుగ‌డ్డ‌ల‌తో ఫ్రై ని ఇలా వెరైటీగా చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Aloo Vepudu : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంటకాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. మ‌నం బంగాళాదుంప‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల్లో బంగాళాదుంప వేపుడు కూడా ఒక‌టి. ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా తిన‌డానికి, అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అలాగే ఎప్పుడూ ఒకేర‌కంగా కాకుండా వెరైటీగా మ‌రింత రుచిగా కూడా మ‌నం ఈ బంగాళాదుంప వేపుడును త‌యారు చేసుకోవ‌చ్చు. అందులో భాగంగా మ‌రింత రుచిగా ఉండేలా, సుల‌భంగా ఈ బంగాళాదుంప వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బంగాళాదుంప వేపుడు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బంగాళాదుంప‌లు – 4, నూనె – 2 టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 10, ఉప్పు -త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్.

Aloo Vepudu recipe in telugu very tasty make like this
Aloo Vepudu

బంగాళాదుంప వేపుడు తయారీ విధానం..

ముందుగా బంగాళాదుంపల‌ను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత బంగాళాదుంప ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ వేయించాలి. ఈ బంగాళాదుంప ముక్క‌లను చిన్న మంట‌పై పూర్తిగా మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌గ్గించిన త‌రువాత కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలావేసి క‌ల‌పాలి. త‌రువాత క‌సూరి మెంతి వేసి క‌లుపుకుని అర నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బంగాళాదుంప వేపుడు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా తిన‌వ‌చ్చు.

D

Recent Posts