Butter Cake : ఓవెన్ లేకున్నా స‌రే బ‌టర్ కేక్‌ను ఇలా సింపుల్‌గా చేయ‌వ‌చ్చు..!

Butter Cake : కేక్.. దీనిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. కేక్ చాలా రుచిగా ఉంటుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. అలాగే మ‌నం ఇంట్లో కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా రుచిగా చేసుకోద‌గిన వివిధ ర‌కాలు కేక్ వెరైటీల‌లో బ‌ట‌ర్ కేక్ కూడా ఒక‌టి. బ‌ట‌ర్ కేక్ చాలా మృదువుగా, రుచిగా ఉంటుంది. బ‌య‌ట కొనే ప‌ని లేకుండా దీనిని మ‌నం ఇంట్లోనే చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఒవెన్ లేక‌పోయినా స‌రే ఈ కేక్ ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌ట‌ర్ కేక్ ను ఇంట్లోనే సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బ‌ట‌ర్ కేక్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ‌ట‌ర్ – అర క‌ప్పు, పంచ‌దార పొడి – ముప్పావు క‌ప్పు, కోడిగుడ్లు – 2, వెనీలా ఎసెన్స్ – ఒక టీ స్పూన్, మైదాపిండి – ఒక క‌ప్పు, బేకింగ్ సోడా – అర టీ స్పూన్, బేకింగ్ పౌడ‌ర్ – ఒక టీ స్పూన్, చాక్లెట్ చిప్స్ – పావు క‌ప్పు.

Butter Cake recipe in telugu make this without oven
Butter Cake

బ‌ట‌ర్ కేక్ త‌యారీయ విధానం..

ముందుగా ఒక గిన్నెలో బ‌ట‌ర్ ను తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి. త‌రువాత పంచ‌దార పొడి వేసి అంతా క‌లిసేలా మ‌రో 2 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. త‌రువాత కోడిగుడ్లు, వెనీలా ఎసెన్స్ వేసి బీట్ చేసుకోవాలి. త‌రువాత మైదాపిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడ‌ర్ వేసి క‌లుపుకోవాలి. ఒక‌వేళ మైదాపిండి మిశ్ర‌మం మ‌రీ గట్టిగా ఉంటే కాచి చ‌ల్లార్చిన పాల‌ను పోసి క‌లుపుకోవాలి. త‌రువాత చాక్లెట్ చిప్స్ వేసి క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ఇసుక లేదా ఉప్పు వేసి అందులో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఫ్రీహీట్ చేసుకోవాలి. త‌రువాత కేక్ ను గిన్నెను తీసుకుని దానికి బ‌ట‌ర్ ను రాయాలి. త‌రువాత మైదాపిండితో డ‌స్టింగ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఇందులో కేక్ బ్యాట‌ర్ ను వేసుకుని గిన్నెను త‌ట్టుకోవాలి. త‌రువాత దీనిపై మ‌రికొన్ని చాక్లెట్ చిప్స్ ను వేసుకోవాలి. త‌రువాత ఈ గిన్నెను ఫ్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఉంచి మూత పెట‌ట్ఇ 25 నుండి 30 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కేక్ గిన్నెను బ‌య‌ట‌కు తీసి పూర్తిగా చ‌ల్లారే వ‌ర‌కు అలాగే ఉంచాలి. త‌రువాత గిన్నెను నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకుని మ‌న‌కు న‌చ్చిన ఆకారంలో క‌ట్ చేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ‌ట‌ర్ కేక్ త‌యార‌వుతుంది. దీనిని పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు. బ‌య‌ట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే రుచిక‌ర‌మైన బ‌ట‌ర్ కేక్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts