Tollywood : సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ప్రస్తుతం విడాకుల కల్చర్ అంతటా కొనసాగుతోంది. ఎంతో ఇష్టపడి ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నవారు కూడా సిల్లీ కారణాలతో విడిపోతున్నారు. గతంలో ఈ సంప్రదాయం విదేశాల్లోనే ఎక్కువగా ఉండేది. కానీ మన దేశంలోనూ రోజు రోజుకీ విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య పెరుగుతోంది. ఇక ఇటీవలే తమిళ స్టార్ నటుడు ధనుష్ తన భార్య ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు తీసుకున్నారు. అంతకు ముందు సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇలా అనేక జంటలు విడిపోతున్నాయి. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం టాలీవుడ్‌కు చెందిన ఓ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్‌లో ప్రస్తుతం విడాకుల జంటలు ఎక్కువైపోతున్నాయి. సమంత, నాగచైతన్యల విడాకుల విషయం మరువక ముందే ఓ జంట విడాకులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ జంట రెండు మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరు దంపతుల మధ్య గొడవలు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వారు ఎవరి దారు వారు చూసుకోనున్నారని తెలుస్తోంది.
ఇక ఆ యువ జంటను కలిపి ఉంచేందుకు వారి తల్లిదండ్రులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారట. అయినప్పటికీ వారు వినడం లేదట. దీంతో వారి మధ్య విడాకులు పక్కా.. అని సమాచారం అందుతోంది. వారికి ప్రస్తుతం కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి కౌన్సిలింగ్ మాత్రమే కొనసాగుతోందట. అన్నీ సవ్యంగా జరిగి సమస్యలు సద్దుమణిగితే వారు మళ్లీ కలిసే ఉంటారని.. లేకపోతే విడిపోతారని తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతోంది. అయితే వారు విడాకులు తీసుకుంటారా.. లేదా.. అన్న విషయం మరికొద్ది రోజుల్లో తేలనుంది.