Toothbrush : రోజూ మనం మన శరీరాన్ని ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో.. అలాగే నోటిని, దంతాలను, చిగుళ్లను కూడా శుభ్రం చేసుకోవాలి. లేదంటే సమస్యలు వస్తాయి. నోటి దుర్వాసన, దంత క్షయం, దంతాలు, చిగుళ్ల నొప్పి, చిగుళ్ల నుంచి రక్తం కారడం, దంతాలు పుచ్చిపోయి విరిగిపోవడం.. వంటి అనేక సమస్యలు వస్తాయి. అందువల్ల నోటి శుభ్రత కూడా ముఖ్యమే. అయితే రోజూ కొందరు రెండు సార్లు బ్రష్ చేస్తారు. కొందరు ఒక్కసారి మాత్రమే బ్రష్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే మనం రోజూ వాడే టూత్ బ్రష్‌ను ఎన్ని నెలలకు ఒకసారి మార్చాలి ? టూత్‌బ్రష్ మార్చాల్సిన సమయం వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది ? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (సీడీసీ) చెబుతున్న ప్రకారం.. ఎవరు అయినా సరే ఒకసారి టూత్ బ్రష్‌ను వాడడం మొదలు పెట్టిన తరువాత.. దాన్ని 3 నెలల తరువాత తీసేయాలి. అయితే కొందరు రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకుంటారు. కనుక వారు ఇంకా ముందుగానే టూత్ బ్రష్‌ను మార్చాల్సి ఉంటుంది.
ఇక టూత్ బ్రష్ మీద ఉండే బ్రిజిల్స్ కొన్ని నెలలకు చెల్లా చెదురుగా మారి విరిగిపోతుంటాయి. అలా జరగడం మొదలయ్యాక వెంటనే ఆ టూత్ బ్రష్‌ను మార్చి కొత్త టూత్ బ్రష్‌ను ఉపయోగించాలి. దీంతో దంతాలు, చిగుళ్లు సరిగ్గా శుభ్రం అవుతాయి. నోరు శుభ్రంగా ఉంటుంది. ఈ విధంగా టూత్ బ్రష్ ను మార్చాల్సి ఉంటుంది. అయితే కొందరు ఏడాదికి ఒకసారి అలా ఎప్పుడో బ్రష్ బాగా అరిగిపోయాక దాన్ని మారుస్తుంటారు. ఇలా అస్సలు చేయరాదు. మన టూత్ బ్రష్ బాగుంటేనే మన నోరు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయని అర్థం చేసుకోవాలి. లేదంటే అవి సమస్యలను తెచ్చి పెడతాయి. కనుక టూత్ బ్రష్‌ను 3 నెలలకు ఒకసారి మార్చాలి. లేదా అంతకు ముందుగానే విరిగిపోతే అప్పుడే బ్రష్‌ను మార్చాలి. దీంతో నోరు, దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.