Bheemla Nayak : ప‌వ‌న్ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి భీమ్లా నాయ‌క్‌..!

Bheemla Nayak : ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు ఆహా, హాట్ స్టార్ ఓటీటీ సంస్థ‌లు గుడ్ న్యూస్ చెప్పాయి. భీమ్లా నాయ‌క్ సినిమాను అనుకున్న తేదీ క‌న్నా ఒక రోజు ముందుగానే స్ట్రీమ్ చేయాల‌ని నిర్ణ‌యించాయి. ఈ క్ర‌మంలోనే భీమ్లా నాయ‌క్ సినిమాను ముందుగా అనుకున్న‌ట్లు మార్చి 25వ తేదీన కాకుండా మార్చి 24వ తేదీనే ఆయా యాప్‌లు స్ట్రీమ్ చేయ‌నున్నాయి. అయితే ఈ స‌డెన్ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణమే ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Bheemla Nayak  releasing on OTT platforms one day before Bheemla Nayak  releasing on OTT platforms one day before
Bheemla Nayak

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది. అయితే అదే రోజు భీమ్లా నాయ‌క్‌ను ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని ముందుగా నిర్ణ‌యించారు. దీంతో ఆహా, హాట్ స్టార్ సంస్థ‌లు రెండూ వేర్వేరు ప్ర‌క‌ట‌న‌ల్లో మార్చి 25వ తేదీన ఈ మూవీని స్ట్రీమ్ చేస్తామ‌ని తెలిపాయి. కానీ ఆ రోజు ఆర్ఆర్ఆర్ మూవీ విడుద‌ల ఉన్నందున ఒక రోజు ముందుగానే భీమ్లా నాయ‌క్‌ను స్ట్రీమ్ చేయాల‌ని నిర్ణ‌యించాయి. దీంతో మార్చి 24నే ఈ సినిమా ఓటీటీల్లోకి రానుంది.

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎలాంటి ఇబ్బంది క‌లిగించ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే ఆహా, హాట్ స్టార్‌లు ఈ నిర్ణ‌యం తీసుకున్నాయ‌ని తెలుస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్ప‌టికే భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అమెరికాలో 20 ల‌క్ష‌ల డాల‌ర్ల‌కు పైగా ప్రీమియ‌ర్‌ల ద్వారా వ‌సూలు చేసింది. ఈ క్ర‌మంలోనే మార్చి 25వ తేదీన సినిమా విడుద‌ల కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్ప‌టికే థియేట‌ర్ల వ‌ద్ద అటు ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌, ఇటు రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ తెగ సంద‌డి చేస్తున్నారు.

Editor

Recent Posts