మీకు నిజంగా నోట్లో వేసుకో గానే ఇట్టే కరిగి పోయే కరకర లాడే ఉస్మానియా బిస్కెట్‌లు కావాలంటే నేను వాడుకగా తెచ్చుకునే ఒక మూడు బేకరీల పేర్లు చెబుతాను. ఉస్మానియా బిస్కెట్ ల ప్రత్యేకత ఏమిటంటే తయారీ కంటే డిమాండ్ ఎక్కువ కావటం వల్ల ఎప్పుడు తాజాగా దొరుకుతాయి. ఒకటి నిమ్రా బేకరీ. ఇది మన చార్మినార్ కు ప్రక్కనే లేదా ఎదురుగానే ఉంటుంది. ఎప్పుడు జన సందోహంతో కిటకిటలాడుతూ ఉంటుంది, ప్రతి దేశపు యూట్యూబర్‌లు హైదరాబాద్ బిర్యానీ, నిమ్రా ఛాయ్ బిస్కెట్ ల వీడియోలు తప్పక చుట్టేస్తారు.
ఇంకా కొన్ని రకాల తాజా బిస్కెట్ లు కూడా చాలా బావుంటాయి. రెండవది నిలోఫర్. ఇది నిలోఫర్ పిల్లల ఆస్పత్రి లక్డికాఫూల్ వద్ద ఉంటుంది.ఇక్కడ ఛాయ్ చాలా బావుంటుంది. ఎప్పుడు జనసమ్మర్ధమై నిలబడ్డానికి కూడా సందు ఉండదు. మూడవది సుభాన్ బేకరీ. ఇది నాంపల్లిలో ఉంటుంది. దీనికి వందేళ్ల వ్యాపారం కలదు. ఇది ఇప్పుడు రూపు మార్చుకొని వ్యాపారంలో కొత్త పుంతలు తొక్కింది.
దీంట్లో రోట్ బిస్కెట్ కూడా చాలా డిమాండ్, ఖరీదైన, ప్రత్యేకత కలిగిన బిస్కెట్. ఎప్పుడైనా కరాచీ ఉస్మానియా బిస్కెట్ లు రుచి చూస్తే పైన నేను తెలిపిన బేకరీల ఉస్మానియా బిస్కెట్‌ల రుచిలో జమీన్ ఆస్మాన్ ల అంతరం ఉంటుంది అని తెలుసుకుంటారు.