ఆధ్యాత్మికం

Bhoo Varaha Swamy : ఈ క్షేత్రాన్ని సంద‌ర్శిస్తే.. ఇల్లు క‌ట్టుకోవాల్సిందే.. భూమి కొనాల్సిందే..!

Bhoo Varaha Swamy : ప్ర‌తి ఒక్క‌రికి జీవితంలో సొంత ఇల్లు క‌ట్టుకోవాల‌నే కోరిక ఉంటుంది. కొంద‌రికి ఈ కోరిక తీరితే కొంద‌రికి మాత్రం సొంత ఇల్లు అనేది క‌ళ‌లాగానే ఉంటుంది. మ‌నం ఇల్లు క‌ట్టుకోవాలంటే ఆర్థిక వ‌న‌రులు అన్ని ఉప్ప‌టికి వాటికి దైవ‌బ‌లం తేడైతేనే మ‌నం ఇల్లు క‌ట్టుకోగ‌లుగుతాము. మ‌న వెంట దైవ‌బ‌లంఉంటేనే మ‌నం ఏదైనా సాధించ‌గ‌లుగుతాము. సొంత ఇల్లు క‌ట్టుకోవాల‌నుకునే క‌ళ నెర‌వేరాల‌నుకునే వారు భూ వ‌రాహ స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించి సంకల్పం చేసుకోవాలి. ఇలా సంక‌ల్పం చేసుకుని త‌మ సొంతింటి క‌ళ నెర‌వేర్చుకున్న తిరిగి మొక్కును చెల్లించుకున్న భ‌క్తులు వేల‌ల్లో ఉన్నారు. ఈ భూవ‌రాహ‌ స్వామి క్షేత్రం క‌ర్ణాట‌క రాష్ట్రంలో మండ్యా జిల్లాలో కె ఆర్ పేట నుండి 18 కిలో మీట‌ర్ల దూరంలో క‌ల‌హ‌ల్లి అనే గ్రామంలో హేమావ‌తి న‌ది ఒడ్డున ఉంటుంది.

ఈ ఆల‌యానికి రావ‌డానికి బ‌స్సు సౌక‌ర్యం ఉన్న‌ప్ప‌టికి అంతా ఎక్కువ‌గా ఉండ‌దు. సొంత వాహ‌నాల్లో రావ‌డ‌మే మంచిది. ఈ ఆల‌యం ప్ర‌తిరోజూ తెరిచి ఉంటుంది. ఉద‌యం 8 గంట‌ల నుండి 2 గంట‌ల వ‌ర‌కు అలాగే మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుండి 7 గంట‌ల వ‌ర‌కు ఉంటుంది. అలాగే ఈ ఆల‌యంలో మ‌ధ్యాహ్నం అన్న ప్ర‌సాదం కూడా ఉంటుంది. స్థ‌ల పురాణాల్లో శ్రీహ‌రి త‌న భార్యను తొడ మీద కూర్చోబెట్టుకుని ముత్యాల హారాలు ఇస్తున్న‌ట్టు పురాణాల్లో చెప్ప‌బ‌డింది. ఎవ‌రైతే ఈవిడ ద‌ర్శ‌నాన్ని చేసుకుంటారో వారు నిత్య సుమంగ‌ళిగా ఉంటార‌ని కూడా చెప్ప‌బ‌డింది. జ‌గ‌త్ పురుషుడైన నారాయ‌ణుడు, జ‌గ‌న్ మాత అయిన భూదేవి భూవ‌రాహ రూపంలో కూర్చోని ఉంటారు. ఇక్క‌డ పూజ‌లు చేయించుకోవాల‌నుకునే వారు హేమ‌వ‌తి న‌దిలో స్నానం చేసి పూజ‌లు చేయాలి.

Bhoo Varaha Swamy temple visit this to build house

ఇక్క‌డ ఇటుక పూజ‌, మ‌ట్టి పూజ అని రెండు రకాలు ఉంటాయి.స్థ‌లం ఉండి ఇల్లు క‌ట్టుకోలేని వారు, అలాగే ఇల్లు క‌ట్ట‌డం మొద‌లై మ‌ధ్య‌లో ఆగిపోయిన వారు ఇటుక పూజ చేయాలి. ఇక్క‌డ రెండు ఇటుకుల‌తో పూజ చేయిస్తారు. ఒక ఇటుక‌ను అక్క‌డే ఉంచి ఇంకో ఇటుకను ఇంటి తీసుకువ‌చ్చి పూజ గ‌దిలో ఉంచాలి. ఇల్లు క‌ట్టుకోవాల‌నుకున్న‌ప్పుడు ఈ ఇటుకను ఇంటి ద్వారం వద్ద ఉంచి పూజ చేసి ఇల్లు క‌ట్టుకోవాలి. అలాగే మ‌ట్టి పూజ‌. భూమి కొనుకోవాల‌న్నా, పొలం కొనుక్కోవాల‌న్నా, భూమ ఎక్కువ ధ‌ర‌కు అమ్ముడు పోవాలన్నా ఈ మ‌ట్టి పూజ‌ను చేయాలి. ఇలా పూజ‌లు చ‌య‌డం వ‌ల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మ‌నం ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయ‌గ‌లుగుతాము. భూ త‌గాదాల‌తో బాధ‌ప‌డే వారు, కోర్టు కేసుల్లో భూమి ఉన్న వారు ఇలా భూ వ‌రాహ స్వామిని పూజించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం క‌లుగుతుంద‌ని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts