హెల్త్ టిప్స్

Foods For High BP : రోజూ ఈ పొడిని ఇంత వాడండి.. ర‌క్త‌నాళాల‌ను వెడ‌ల్పు చేస్తుంది..!

Foods For High BP : మ‌నం వంటింట్లో వాడే సుగంధ ద్ర‌వ్యాల‌ల్లో యాల‌కులు ఒక‌టి. యాల‌కులు చ‌క్క‌టి వాస‌నను, రుచిని క‌లిగి ఉంటాయి. దాదాపు మ‌నం తయారు చేసే అన్ని ర‌కాల స్వీట్ ల‌లో వీటిని వాడుతూ ఉంటాము. అలాగే మ‌సాలా వంట‌కాలు, బిర్యానీ, పులావ్ వంటి వాటిలో కూడా యాల‌కుల‌ను విరివిగా వాడుతూ ఉంటాము. యాల‌కుల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం చేసే వంట‌కాలు మ‌రింత రుచిగా, క‌మ్మ‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. మ‌నం వంట‌ల్లో వాడే ఈ యాల‌కులు మ‌న‌కు రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించ‌డంలో కూడా ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయని నిపుణులు చెబుతున్నారు. యాల‌కుల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు చాలా మందికి తెలియ‌న‌ప్ప‌టికి వీటిని వంట‌ల్లో వాడుతున్నారు. యాల‌కుల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చని ముఖ్యంగా బీపీని త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. యాల‌కుల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌న‌లో చాలా మంది డ‌యోటిక్ ట్లాబెట్స్ ను వాడుతూ ఉంటారు. శ‌రీరంలో నీరు ఎక్కువ‌గా చేరడం వ‌ల్ల గుండె, కాలేయం, మూత్ర‌పిండాలు వంటి వాటిపై ఒత్తిడి ఎక్కువ‌గా ప‌డుతుంది. దీంతో వారు మందులు వాడి మూత్రం ద్వారా నీరు బ‌య‌ట‌కు పోయేలా చేస్తూ ఉంటారు. అలాంటి వారు యాల‌కుల‌ను వాడ‌డం వ‌ల్ల స‌హ‌జంగానే నీరు మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పోతుంది. అంతేకాకుండా యాల‌కుల‌ను వాడ‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాలు మృదువ‌గా త‌యారవుతాయి. దీంతో ర‌క్త‌నాళాల యొక్క సాగే గుణం పెరిగి బీపీ త‌గ్గుతుందని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డించారు. సాధార‌ణంగార‌క్త‌నాళాలు ముడుచుకుంటూ సాగుతూ ర‌క్తాన్ని ముందుకు పంపిస్తూ ఉంటాయి. బీపీ వ‌చ్చిన వారిలో ర‌క్త‌నాళాలు సాగే గుణాన్ని త‌క్కువ‌గా క‌లిగి ఉంటాయి. దీంతో గుండె ఎక్కువ ఒత్తిడితో ర‌క్తాన్ని ముందుకు పంపిస్తూ ఉంటుంది. ర‌క్త‌నాళాలు ముడుచుకునే గుణాన్ని ఎక్కువ‌గా క‌లిగి ఉంటే ఇది ఆరోగ్యాన్ని అస్స‌లు మంచిది కాదు.

many wonderful health benefits of cardamom powder how to use this

గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఇలా బీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు యాల‌కుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాల సాగే గుణం పెరుగుతుంది. దీంతో బీపీ అదుపులోకి వస్తుంది. రోజూ ఒక‌టిన్న‌ర గ్రాముల చొప్పున యాల‌కుల పొడిని ఉద‌యం మ‌రియు సాయంత్రం 12 వారాల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల బీపీ అదుపులోకి వ‌స్తుందని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డించారు. బీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో యాల‌కుల పొడి, తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల బీపీత్వ‌ర‌గా అదుపులోకి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ విధంగా యాల‌కుల పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే క్యాన్స‌ర్ రాకుండా ఉండాల‌న్నా, వ‌చ్చిన క్యాన్స‌ర్ పెర‌గ‌కుండా ఉండాల‌న్నా యాల‌కుల పొడిని తీసుకోవాల‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. యాల‌కుల పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే ర‌క్ష‌క క‌ణాల‌కు క్యాన్స‌ర్ క‌ణాల‌ను గుర్తించే సామ‌ర్థ్యం పెరుగుతుంద‌ని దీంతో మ‌నం క్యాన్స‌ర్ బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా యాల‌కులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని త‌ప్ప‌కుండా అంద‌రూ ఆహారంలో భాగంగా తీసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని నిపుణులు చెబుతున్నారు.

Admin

Recent Posts