Cabbage Manchuria : క్యాబేజీతోనూ మంచూరియా చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Cabbage Manchuria : మ‌న‌కు ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో అభించే ప‌దార్థాల్లో మంచురియా కూడా ఒక‌టి. క్యాబేజితో చేసే ఈ మంచురియా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ మంచురియాను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా అదే రుచితో ఈ మంచురియాను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాబేజితో ఎంతో రుచిగా ఉండే మంచురియాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మంచురియా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క్యాబేజ్ తురుము – 500 గ్రా., చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, మైదాపిండి – 4 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ -2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, ట‌మాట సాస్ – 2 టేబుల్ స్పూన్స్, చిల్లీ సాస్ – ఒక టేబుల్ స్పూన్, సోయా సాస్ – ఒక టేబుల్ స్పూన్, వెనిగ‌ర్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Cabbage Manchuria recipe in telugu very tasty how to cook
Cabbage Manchuria

మంచురియా తయారీ విధానం..

ముందుగా క్యాబేజ్ తురుమును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో కార్న్ ఫ్లోర్, మైదాపిండి, ఉప్పు, ఫుడ్ క‌ల‌ర్ వేసి క్యాబేజిని న‌లుపుతూ క‌ల‌పాలి. త‌రువాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత ఈ క్యాబేజి మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క్యాబేజి ఉండ‌ల‌ను వేసి మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి.తరువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగ‌ర్, మిరియాల పొడి వేసి క‌ల‌పాలి.

దీనిని 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ఉప్పు, అర గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. నీళ్లు మరిగిన త‌రువాత మంచురియా బాల్స్ వేసి పెద్ద మంట‌పై క‌లుపుతూ వేయించాలి. మ‌సాలాల‌న్ని మంచురియా బాల్స్ కు ప‌ట్టి ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మంచురియా త‌యార‌వుతుంది. ఈ మంచురియాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. సాయంత్రం స‌మ‌యాల్లో బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఇలా ఇంట్లోనే ఎంతో రుచిగా ఉండే మంచురియాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts