మన దేశమంటేనే అనేక సాంప్రదాయాలకు, ఆచారాలకు, వ్యవహారాలకు నెలవు. ఎన్నో భిన్నమైన మతాలు అనేక విభిన్నమైన పద్ధతులను పాటిస్తాయి. అయితే ఏ మతంలోనైనా వివాహం పట్ల అనేక ఆచారాలను, సాంప్రదాయాలను ఆయా వర్గాల వారు పాటిస్తారు. ఇక హిందూ మతం విషయానికి వస్తే ముందు వధూవరుల జాతకాలు చూసి అవి పొంతన కుదిరాకే ముహూర్తాలు నిర్ణయిస్తారు. అందుకు అనుగుణంగానే నిశ్చితార్థం, పెళ్లి జరిపిస్తారు. ఇది సరే. ఈ తంతు గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇంతకీ ఇప్పుడు విషయం ఏమిటీ అంటారా..? ఏమీ లేదండీ…
హిందువులైతే ముందుగా జాతకాలు చూసి పెళ్లి పెట్టుకుంటారు. కానీ మరి అమెరికా, లండన్, రష్యా వంటి విదేశాల్లోనైతే వారు వివాహానికి ముందు ఏం చేస్తారు..? వారు జతకాలు చూడరు. ముహూర్తాలు నిర్ణయించరు. అయినా పెళ్లి మాత్రం చేసుకుంటారు. మరి.. ఓ జంటకు వారు వివాహం ఎలా సెట్ చేస్తారు..? దేని ప్రకారం నూతన దంపతులు కలసి మెలసి ఉంటారని, ఆరోగ్యంగా ఉంటారని నిర్ణయిస్తారు..? అంటే.. అవును, అందుకు వారు ఓ మార్గం పాటిస్తారు. అదే డీఎన్ఏ టెస్ట్.
విదేశాల్లో పెళ్లి చేసుకోబోయే వధూవరులు ఇద్దరు డీఎన్ఏ టెస్ట్ కచ్చితంగా చేయించుకంటారట. వ్యాధులు ఏమేం ఉన్నాయని నిర్దారించుకునేందుకు కాదు వారు టెస్టులు చేసేది. వారి ఇద్దరి డీఎన్ఏ ప్రకారం వారు కలిస్తే వారి ఆరోగ్యం ఎలా ఉంటుంది, వారి పిల్లలు ఎలా ఉంటారు, వారికి ఏమేం వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ? అనే వివరాలను తెలుసుకుంటానికి వారు డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంటారు. అలా చేశాక రిజల్ట్స్ అనుకూలంగా వస్తేనే వివాహం చేసుకుంటారట. అవును, మీరు విన్నది నిజమే. అయితే దీన్ని బట్టి మనకు ఇప్పటికే ఒక విషయం మదిలోకి వస్తుంది. అదేమిటంటే… మన దేశంలో ఏ వర్గం వారైనా మేనరికం చేసుకోరు తెలుసు కదా. దాంతో పుట్టబోయే పిల్లలకు వ్యాధులు వస్తాయని పెద్దల నమ్మకం. అందుకే చాలా మంది మేనరికం చేసుకోరు. ఇది విదేశీయుల డీఎన్ఏ టెస్టుకు దగ్గరిగా ఉంది కదా. ఓ సారి ఆలోచించి చూస్తే మీకే తెలుస్తుంది. ఆ… కరెక్టే కదా. మరి ఆ మాత్రం దానికి డీఎన్ఏ టెస్ట్ దాకా ఎందుకు..! ఇప్పటికైనా తెలిసింది కదా, భారతీయుల తెలివి ఏంటో..!