Cabbage Shanaga Pappu Curry : క్యాబేజీ, శ‌న‌గ‌ప‌ప్పు క‌లిపి ఇలా కూర చేయండి.. వేడి అన్నంలో తింటే రుచిగా ఉంటుంది..!

Cabbage Shanaga Pappu Curry : మ‌నం శ‌న‌గ‌ప‌ప్పుతో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. శ‌న‌గ‌ప‌ప్పుతో ఇత‌ర కూర‌గాయ‌ల‌ను క‌లిపి వంట‌లు చేస్తూ ఉంటాము. శ‌న‌గ‌ప‌ప్పును వేసి చేసే ఈ కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఇలా శ‌న‌గ‌ప‌ప్పుతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో క్యాబేజి శ‌న‌గ‌ప‌ప్పు కూర కూడా ఒక‌టి. శ‌న‌గ‌ప‌ప్పు, క్యాబేజి క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ క్యాబేజి శ‌న‌గ‌ప‌ప్పు కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాబేజి శ‌న‌గ‌ప‌ప్పు క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన క్యాబేజి – అర‌కిలో, ప‌చ్చి కొబ్బ‌రి తురుము -ఒక కప్పు, నాన‌బెట్టిన శ‌న‌గ‌ప‌ప్పు -ఒక క‌ప్పు, త‌రిగిన ట‌మాటాలు – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, కారం – 2 టీ స్పూన్స్, ప‌సుపు – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా -ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్.

Cabbage Shanaga Pappu Curry recipe in telugu tasty with rice
Cabbage Shanaga Pappu Curry

క్యాబేజి శ‌న‌గ‌ప‌ప్పు క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో క్యాబేజి, శ‌న‌గ‌ప‌ప్పు, ఉప్పు, ప‌సుపు, త‌గిన‌న్ని నీళ్లు, కొద్దిగా నూనె వేసి మూత పెట్టాలి. దీనిని 4 నుండి 5 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత కారం, ఉప్పు, ప‌సుపు, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి.

ట‌మాట ముక్క‌లు ఉడికిన త‌రువాత ఉడికించిన క్యాబేజి వేసి క‌ల‌పాలి. త‌రువాత కొబ్బ‌రి తురుము వేసి క‌ల‌పాలి. అవ‌స‌ర‌మైతే మ‌రికొద్దిగా నీళ్లు పోసుకుని మూత పెట్టి మ‌రో 10 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత గ‌రం మ‌సాలా, కొత్తిమీర చ‌ల్లుకుని క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి శ‌న‌గ‌పప్పు కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts