Menthikura Chicken : మెంతికూర చికెన్‌ను ఇలా చేయండి.. చ‌పాతీ, అన్నం.. ఎందులోకి అయినా బాగుంటుంది..!

Menthikura Chicken : మ‌నం వివిధ రుచుల్లో చికెన్ క‌ర్రీని వండుతూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన చికెన్ వెరైటీల‌లో మెంతికూర చికెన్ కూడా ఒక‌టి. మెంతికూర వేసి చేసే ఈ చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే చికెన్ క‌ర్రీల కంటే ఈ విధంగా మెంతికూర వేసి చేసిన చికెన్ క‌ర్రీ మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఒక్క‌సారి దీనిని రుచి చూసారంటే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడుగుతారు. ఎంతో రుచిగా ఉండే మెంతికూర చికెన్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మెంతికూర చికెన్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దారర్థాలు..

చికెన్ – అర‌కిలో, మెంతికూర – గుప్పెడు, నూనె -3 టేబుల్ స్పూన్స్, పొడ‌వుగా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, పుచ్చ‌గింజ‌లు లేదా జీడిప‌ప్పు -ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ట‌మాటాలు – 2, ఉప్పు – త‌గినంత‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క‌, జీల‌క‌ర్ర -అర టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టేబుల్ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి -ఒకటిన్న‌ర టీ స్పూన్, నీళ్లు – ఒక‌టిన్న‌ర గ్లాస్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Menthikura Chicken recipe in telugu make like this
Menthikura Chicken

మెంతికూర చికెన్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత మెంతికూర వేసి క‌ల‌పాలి. ఈ మెంతికూర‌ను పూర్తిగా వేయించిన త‌రువాత ప‌చ్చ‌గింజ‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, కొద్దిగా ఉప్పు వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లారనివ్వాలి. త‌రువాత దీనిని జార్ లోకి తీసుకుని మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో మ‌రికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీల‌క‌ర్ర‌, మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత చికెన్ వేసి క‌ల‌పాలి. ఇందులోనే ప‌సుపు, ఉప్పు వేసి క‌లిపి 5 నిమిషాల పాటు వేయించాలి.

త‌రువాత‌ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌ల‌పాలి. ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత నీళ్లు, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. తరువాత మూత పెట్టి చిన్న మంట‌పై చికెన్ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. చిర‌వ‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మెంతికూర చికెన్ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts