Iron Foods For Anemia : ర‌క్త‌హీన‌త ఉన్న‌వారు వీటిని తింటే ర‌క్తం ఫుల్‌గా ప‌డుతుంది..!

Iron Foods For Anemia : మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాల‌న్నా శ‌రీరంలో జీవ‌క్రియలు సాఫీగా సాగాల‌న్నా మ‌న శ‌రీరానికి అనేక ర‌కాల పోష‌కాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో ఐర‌న్ కూడా ఒక‌టి. పురుషుల‌కు రోజుకు 17 మిల్లీ గ్రాములు, స్త్రీల‌కు 21 మిల్లీ గ్రాములు అవ‌స‌ర‌మ‌వుతుంది. అదే గ‌ర్భిణీ స్త్రీల‌కు, బాలింత‌ల‌కు రోజుకు 35 మిల్లీ గ్రాముల ఐర‌న్ అవ‌స‌ర‌మ‌వుతుంది. స్త్రీలల్లో ఐర‌న్ నిల్వ‌లు త‌క్కువ‌గా , పురుషుల్లో ఎక్కువ‌గా ఉంటాయి. స్త్రీల్ల‌లో కాలేయం 300 మిల్లీ గ్రాముల ఐర‌న్ ను మాత్ర‌మే నిల్వ ఉంచుకోగ‌ల‌దు. పురుషుల్లో మాత్రం ఈ నిల్వ‌లు 1000 మిల్లీ గ్రాముల వ‌ర‌కు ఉంటాయి. అలాగే స్త్రీల్ల‌లో నెల‌స‌రి స‌మ‌యంలో ర‌క్త‌స్రావం ద్వారా ఐర‌న్ ఎక్కువ‌గా పోతుంది క‌నుక స్త్రీల‌కు ఐర‌న్ ఎక్కువ అవ‌స‌ర‌మ‌వుతుంది.

అలాగే మ‌న రక్తంలో 3 నుండి 4 గ్రాముల ఐర‌న్ మాత్ర‌మే ఉంటుంది. మిగిలిన ఐర‌న్ ఇత‌ర రూపంలో కాలేయంలో నిల్వ ఉంటుంది. ఐర‌న్ మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌రం. మ‌న శ‌రీరంలో ఎర్ర ర‌క్త‌క‌ణాలు త‌యారీలో ఐర‌న్ కీల‌క పాత్ర పోషిస్తుంది. శ‌రీరంలో ఐర‌న్ ఉంటేనే ర‌క్త‌క‌ణాలు త‌యార‌వుతాయి. లేదంటే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌లెత్తుతుంది. అలాగే మ‌నం పీల్చుకున్న ఆక్సిజ‌న్ రక్తం ద్వారా అన్ని అవ‌య‌వాల‌కు చేరుతుంది. ర‌క్తంలో త‌గినంత ఐర‌న్ ఉంటేనే ఈ ఆక్సిజ‌న్ అన్ని అవ‌య‌వాల‌కు స‌క్ర‌మంగా చేరుతుంది. అదే విధంగా మ‌నం తీసుకున్న ఆహారంలో ఉండే గ్లూకోజ్ శ‌క్తిగా మారాల‌న్నా కూడా ఐర‌న్ ఎంతో అవ‌స‌ర‌మ‌వుతుంది. అదే విధంగా న‌రాల క‌ణాలు సంకేతాల‌ను చేర‌వేయ‌ల‌న్నా కూడా ఐర‌న్ అవ‌స‌ర‌మ‌వుతుంది.

Iron Foods For Anemia take daily to reduce problem
Iron Foods For Anemia

అలాగే మ‌న శ‌రీరంలో ఉండే ర‌క్ష‌క ద‌ళాలు ఎంజైమ్ ల‌ను విడుద‌ల చేయాల‌నన్నా అలాగే ఈ ర‌క్త‌క‌ణాలు ఎక్కువ‌గా త‌యార‌వ్వాల‌న్నా కూడా ఐర‌న్ త‌గిన మోతాదులో ఉండాల్సిందే. ఈ విధంగా ఐర‌న్ మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌ర‌మ‌వుతుంది. అదే విధంగా ఐర‌న్ ఉన్న ఆహారాల‌ను మ‌నం తీసుకున్న‌ప్ప‌టికి వీటిలో ఉండే ఐర‌న్ మ‌న శ‌రీరానికి చ‌క్క‌గా అందాలంటే మ‌న శ‌రీరంలో త‌గినంత విట‌మిన్ సి ఉండాలి. లేదంటే మ‌నం తీసుకునే ఆహారాల్లో ఉండే ఐర‌న్ ప్రేగుల్లో నుండి మ‌లం ద్వారా బ‌య‌ట‌కు పోతుంది. క‌నుక ఐర‌న్ తో పాటు విట‌మిన్ సి ఉండే ఆహారాల‌ను కూడా తీసుకోవాలి. అయితే నేటి తరుణంలో చాలా మంది ఐర‌న్ లోపంతో బాధ‌ప‌డుతున్నారు. ఐర‌న్ లోపించ‌డం వ‌ల్ల మ‌నం తీవ్ర అనారోగ్యాల బారిన ప‌డాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న‌కు మార్కెట్ లో ఐర‌న్ స‌ప్లిమెంట్స్ విరివిరిగా ల‌భిస్తాయి.

వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఐర‌న్ లోపం రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే మ‌నం తీసుకునే ఆహారాల ద్వారా కూడా మ‌నం ఐర‌న్ లోపాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. ఐర‌న్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 100 గ్రాముల ఖ‌ర్జూర పండ్ల‌ల్లో 7. 3 మిల్లీగ్రాములు, పుచ్చ‌కాయ ముక్క‌లు 8 మిల్లీగ్రాములు, న‌ల్ల నువ్వులు 15 మిల్లీగ్రాములు, తెల్ల నువ్వులు 15 మిల్లీగ్రాములు, ముళ్ల తోట‌కూర 23 మిల్లీగ్రాములు, త‌వుడు 35 మిల్లీగ్రాములు, క్యాలీప్ల‌వ‌ర్ కాడ‌లు 40 మిల్లీగ్రాములు, మామిడికాయ పొడి 45 మిల్లీగ్రాములు, కొబ్బ‌రి చెక్క 69 మిల్లీగ్రాములు, న‌ల్ల నువ్వుల‌లో ఐర‌న్ ఉంటుంది. ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల స‌ప్లిమెంట్స్ తీసుకునే అవ‌స‌రం లేకుండా మ‌న శ‌రీరానికి కావ‌ల్సినంత ఐర‌న్ ల‌భిస్తుంది. ఈ ఆహారాల‌ను తీసుకుంటూ శ‌రీరంలో ఐర‌న్ లోపం లేకుండా చూసుకోవాలని లేదంటే అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts