Cauliflower Bathani Masala Curry : కాలీఫ్లవర్, బఠాణీల‌ను క‌లిపి ఇలా మసాలా కూర చేయండి.. అన్నం, చపాతీల‌లోకి బాగుంటుంది..

Cauliflower Bathani Masala Curry : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయ‌ల్లో క్యాలీప్ల‌వ‌ర్ కూడా ఒక‌టి. క్యాలిప్ల‌వ‌ర్ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాలిప్ల‌వ‌ర్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది క్యాలీప్ల‌వ‌ర్ ను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ క్యాలీప్ల‌వ‌ర్ తో మ‌నం ఎంతో రుచిగా ఉండే మసాలా కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చి బ‌ఠాణీ వేసి చేసే ఈ మ‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఎంతో రుచిగా ఉండే క్యాలీప్ల‌వ‌ర్ బ‌ఠాణీ మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాలీప్ల‌వ‌ర్ బ‌ఠాణీ మ‌సాలా కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన క్యాలీప్ల‌వ‌ర్ – 1 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది), ఉడికించిన ప‌చ్చి బ‌ఠాణీ – అర‌ క‌ప్పు, ట‌మాటాలు – 2, త‌రిగిన కొత్తిమీర – ఒక క‌ట్ట‌, పెద్ద ముక్క‌లుగా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, యాల‌కులు – 2, ల‌వంగాలు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, సాజీరా – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకులు – 2, ప‌సుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్.

Cauliflower Bathani Masala Curry recipe in telugu how to make this
Cauliflower Bathani Masala Curry

క్యాలీప్ల‌వ‌ర్ బ‌ఠాణీ మ‌సాలా కూర త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో పెద్ద‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు, కొత్తిమీర వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. అలాగే ట‌మాటాల‌ను కూడా ఫ్యూరీలాగా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా వేయించాలి. త‌రువాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉప్పు, ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత ట‌మాట ఫ్యూరీ వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉడికించిన క్యాలీప్ల‌వ‌ర్, బ‌ఠాణీ వేసి క‌ల‌పాలి.

త‌రువాత ముప్పావు గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 6 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత క‌సూరి మెంతి, గ‌రం మ‌సాలా, ప‌చ్చిమిర్చి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 2 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాలీప్ల‌వ‌ర్ బ‌ఠాణీ మ‌సాలా కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. క్యాలీప్ల‌వ‌ర్ తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts